jai hunuman:శ్రీరాముడికి హనుమంతుడు ఇచ్చిన మాటేమిటీ:

jai hanuman

హీరో తేజ సజ్జా ప్రధాన పాత్రలో నటించిన హనుమాన్ సినిమా బాక్సాఫీస్ వద్ద సెన్సేషనల్ హిట్ సాధించింది చిన్న చిత్రంగా విడుదలైన ఈ సినిమా అంచనాలకు మించి విజయాన్ని సాధించి, ప్రేక్షకులని మంత్రముగ్ధులను చేసింది. ప్రశాంత్ వర్మ దర్శకత్వం వహించిన ఈ చిత్రానికి ఇప్పటికే భారీ ఫాలోయింగ్ ఏర్పడింది హనుమాన్‌కు సీక్వెల్ ఉంటుందనే వార్త అభిమానుల్లో ఉత్సాహం రేపింది. “శ్రీరాముడికి హనుమంతుడు ఇచ్చిన మాట ఏమిటి అనే ఆసక్తికరమైన ప్రశ్నకు సమాధానమే హనుమాన్ సెకండ్ పార్ట్ అని భావిస్తున్నారు. సినిమా మేకర్స్ దీన్ని ధృవీకరిస్తూ ఈ సీక్వెల్‌ను జై హనుమాన్ పేరుతో త్వరలో విడుదల చేయనున్నట్లు ప్రకటించారు. దీని ప్రకారం, హనుమాన్ సెకండ్ పార్ట్‌పై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.

ఈ చిత్రానికి సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్ అక్టోబర్ 30న విడుదల చేసి, దీపావళి సందర్భంగా అభిమానులకు దర్శకుడు ప్రశాంత్ వర్మ ప్రత్యేక కానుక అందించారు. ఈ పోస్టర్ విడుదలకు ముందు నుండి హనుమాన్ పాత్రలో ఏ నటుడు కనిపిస్తాడన్న ఉత్కంఠ ప్రేక్షకుల్లో నెలకొంది. చివరకు హనుమాన్ పాత్రలో కన్నడ స్టార్ రిషబ్ శెట్టి కనిపించనున్నట్లు అధికారికంగా ప్రకటించడం జరిగింది. ఈ అనౌన్స్‌మెంట్‌తో అభిమానులు, సినీప్రియులు ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నారు.

హనుమాన్ పాత్రలో రిషబ్ శెట్టి కనిపించనున్నట్లు ప్రశాంత్ వర్మ స్వయంగా వెల్లడించారు. రిషబ్ శెట్టి ఫస్ట్ లుక్ పోస్టర్ విడుదల కాగా అందులో ఆంజనేయుడి పవర్‌ఫుల్ అటిట్యూడ్‌ను అద్భుతంగా ప్రదర్శించారు ఫస్ట్ లుక్ పోస్టర్ రీల్‌ను సోషల్ మీడియాలో అభిమానులు విపరీతంగా షేర్ చేస్తున్నారు ఈ సీక్వెల్‌లో శ్రీరాముడికి హనుమంతుడు ఇచ్చిన మాట ప్రధాన కథాంశంగా ఉన్నట్లు సమాచారం సెకండ్ పార్ట్‌లో తేజ సజ్జా కూడా తన పాత్రను కొనసాగిస్తాడని విశ్వసిస్తున్నారు ఈ ప్రాజెక్ట్‌తో పాటు, ప్రశాంత్ వర్మ అధీర మరియు మహాకాళి వంటి భారీ బడ్జెట్ సినిమాలను కూడా రూపొందిస్తున్నారు జై హనుమాన్‌పై వచ్చిన తాజా అప్‌డేట్‌తో ప్రేక్షకుల్లో ఈ చిత్రంపై మరింత ఉత్కంఠ పెరిగింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *