నాగ చైతన్య-శోభిత పెళ్లి డేట్ ఫిక్స్..?

అక్కినేని నాగ చైతన్య, శోభిత ధూళిపాళల వివాహం డిసెంబర్ 4న జరుగుతుందని సోషల్ మీడియాలో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. దీనిపై అధికారిక ప్రకటన త్వరలోనే వెలువడవచ్చని సమాచారం. ఈ వివాహానికి సంబంధించిన ఏర్పాట్లు ఇప్పటికే ప్రారంభమయ్యాయని, ఇన్‌స్టాగ్రామ్‌లో శోభిత చేసిన కొన్ని పోస్ట్‌లు వైరల్ అవుతున్నాయి.

వీరి పెళ్లి డెస్టినేషన్ వెడ్డింగ్‌గా ఉంటుందా లేక హైదరాబాద్‌లోనే జరగనుందా అనే అంశంపై అభిమానులు ఆసక్తిగా చర్చిస్తున్నారు. డెస్టినేషన్ వెడ్డింగ్ అనుకుంటే వారు ఏ విదేశీ లొకేషన్‌ను ఎంచుకుంటారనే ఆసక్తితో చాలామంది ఎదురు చూస్తున్నారు. ఈ వివాహ వేడుకకు కుటుంబసభ్యులు, అత్యంత సన్నిహితుల్ని మాత్రమే ఆహ్వానించనున్నారని, పెళ్లి వేడుకను అత్యంత ప్రైవేటుగా నిర్వహించాలని అక్కినేని ఫ్యామిలీ నిర్ణయం తీసుకుందనే వార్తలు ఆ మధ్య వినిపించాయి. మరి ఏంజరుగుతుందో చూడాలి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *