రిటైర్డ్ ఉద్యోగులకు శుభవార్త

ప్రభుత్వ రిటైర్డ్ ఉద్యోగులకు తపాలా శాఖ గుడ్ న్యూస్ తెలిపింది. పింఛన్ వ్యవహారాలను మరింత సులభతరం చేయడం లో డిజిటల్ లైఫ్ సర్టిఫికెట్ పొందేందుకు ఇండియా పోస్ట్ పేమెంట్స్ బ్యాంక్ ద్వారా ఇంటి వద్దకే అందించే సదుపాయం ఇప్పుడు అందుబాటులో తీసుకొచ్చింది. డిజిటల్ లైఫ్ సర్టిఫికెట్ కోసం పెన్షనర్లు మరియు కుటుంబ పింఛన్‌దారులు రూ.70 ఫీజు చెల్లించాలి.

దీనికి అవసరమైన వివరాలు:

ఆధార్ నెంబర్
మొబైల్ నెంబర్
పిఓ పి నెంబర్ (PPO Number)
బ్యాంక్ అకౌంట్ వివరాలు
థంబ్ ఇప్రెషన్ (Thumb Impression)
సమయం: అవసరమైన వివరాలను సమర్పించిన తర్వాత నిమిషాల్లో డిజిటల్ లైఫ్ సర్టిఫికెట్ అందించబడుతుంది.
ఇతర వివరాలు:
సబ్మిషన్: పెన్షనర్లు ప్రతి ఏటా నవంబర్ నెలలో ఈ సర్టిఫికెట్‌ను సబ్‌మిట్ చేయాలి. ఇది చేయకపోతే వారి పెన్షన్ నిలిపివేయబడుతుంది.
ప్రచారం: కేంద్ర ప్రభుత్వం నవంబర్ 1 నుంచి దేశవ్యాప్తంగా ఈ విధానంపై అవగాహన కల్పించేందుకు ప్రచారం ప్రారంభించనుంది.
ఈ విధానం ద్వారా, రిటైర్డ్ ఉద్యోగుల కోసం డిజిటల్ లైఫ్ సర్టిఫికెట్ ప్రాప్తి మరింత సులభం అవుతుంది, తద్వారా వారు తమ పింఛన్లు సులభంగా పొందవచ్చు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *