నవంబర్ 26న పార్లమెంట్ ఉభయసభల ప్రత్యేక సమావేశం

A special meeting of both houses of Parliament on November 26

న్యూఢిల్లీ: నవంబర్‌ 26న పార్లమెంట్ ఉభయ సభలు ప్రత్యేక సమావేశానికి సిద్ధమవుతున్నాయి. రాజ్యాంగానికి ఆమోదం ఇచ్చిన సందర్భంగా 75 సంవత్సరాలు పూర్తవుతున్న నేపథ్యంలో నవంబర్ 26న ఈ సమావేశం జరగనుందని అధికారులు తెలిపారు. 1949లో నవంబర్ 26న రాజ్యాంగం ఆమోదించిన వేళ, ఉభయ సభల సభ్యులు సెంట్రల్ హాల్‌లో సమావేశం కానున్నారు. 1950 జనవరి 26 నుంచి రాజ్యాంగం అమల్లోకి వచ్చింది.

ఈ సమావేశంలో రాజ్యాంగానికి సంబంధించిన వివిధ ఆర్టికల్స్, చట్టాల్లో జరిగిన మార్పులు, చేర్పుల పై చర్చ జరుగుతుందని అనుకుంటున్నారు. గతంలో, నవంబర్ 26ను జాతీయ న్యాయ దినోత్సవంగా జరుపుకునేవారు. అయితే 2015లో అంబేద్కర్ 125వ జయంతిని పురస్కరించుకుని ఈ రోజును రాజ్యాంగ దినోత్సవంగా మార్చారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

A deep dive to the rise of conscious consumerism. Finding opportunity in a saturated market : how to thrive in the skincare and beauty industry biznesnetwork. Life und business coaching in wien – tobias judmaier, msc.