Samantha: రెండో పెళ్లిపై స్పందించిన సమంత.. ఏమన్నారంటే

samantha ruth prabhu1727769788

సమంత కొన్ని సంవత్సరాల పాటు ప్రేమలో మునిగి పెద్ద సంప్రదాయంతో పెళ్లి చేసుకున్న నాగచైతన్య సమంత తర్వాత విడాకులు తీసుకున్న విషయం అందరికీ తెలిసిందే నాలుగేళ్ల పాటు వివాహ బంధంలో ఉన్న ఈ జంట తమ పరస్పర అంగీకారంతో విడిపోయారు వీరి విడాకుల తర్వాత కూడా వారి వ్యక్తిగత జీవితం గురించి మీడియాలో చర్చలు కొనసాగుతూనే ఉన్నాయి విడాకుల తర్వాత సమంతకు ఆరోగ్యపరమైన సమస్యలు ఎదురయ్యాయి ముఖ్యంగా మయోసైటిస్‌ అనే వ్యాధితో బాధపడుతూ ఆమె సినిమాలకు దూరమయ్యింది. ప్రస్తుతం ఆమె ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకుంటూ తిరిగి చిత్రపరిశ్రమలో సక్రియమవుతోంది. సమంత నటించిన తాజా ప్రాజెక్ట్‌ ‘సిటాడెల్‌’ వెబ్ సిరీస్, త్వరలో విడుదలకు సిద్ధంగా ఉంది.

అదే సమయంలో నాగచైతన్య నటి శోభితతో ప్రేమలో ఉన్నారని త్వరలోనే వీరిద్దరూ వివాహ బంధంలోకి అడుగుపెట్టబోతున్నారని వార్తలు వస్తున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో సమంత రెండో వివాహం గురించి సోషల్ మీడియాలో పెద్ద చర్చ జరిగింది నాగ చైతన్య పెళ్లి చేసుకుంటున్న తరుణంలో సమంత కూడా మళ్లీ పెళ్లి చేసుకుంటుందా అన్న ప్రశ్నలు వినిపించాయి తాజాగా ‘సిటాడెల్‌’ వెబ్ సిరీస్ ప్రమోషన్ కార్యక్రమంలో పాల్గొన్న సమంతకు ఇదే ప్రశ్న ఎదురైంది. “మీరు రెండో వివాహం చేసుకోవాలని ఆలోచిస్తున్నారా అని అడిగినప్పుడు, సమంత చాలా స్పష్టమైన మరియు ఆసక్తికరమైన సమాధానం ఇచ్చింది “నేను ప్రేమించి పెళ్లి చేసుకున్నాన కానీ ఆ తర్వాత విడిపోయాను ప్రస్తుతం జీవితంలో రెండో వివాహం గురించి నేను ఏమీ ఆలోచించడం లేదు నాకు ఎవరి తోడు అవసరం లేదు, నేను నా జీవితంలో ఎంతో సంతోషంగా ఉన్నాను,” అంటూ సమంత తన మనసులోని మాట బయటపెట్టింది.

సమంత ఈ వ్యాఖ్యలు ప్రస్తుతం సోషల్ మీడియాలో విస్తృతంగా పాపులర్ అవుతున్నాయి చాలా మంది అభిమానులు ఆమె రెండో వివాహం చేసుకోవాలని కోరుకుంటూ కామెంట్లు చేస్తున్నారు ఇక ‘సిటాడెల్‌’ వెబ్ సిరీస్‌ అమెజాన్ ప్రైమ్ వేదికగా నవంబర్ 7 నుంచి స్ట్రీమింగ్ కానుంది ఇప్పుడు సమంత కెరీర్‌ ‘సిటాడెల్‌’ తర్వాత ఏదో ప్రత్యేక మలుపు తీసుకుంటుందా అనే విషయం అందరికీ ఆసక్తికరంగా మారింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Read more about un реасеkеереrѕ іn lebanon ѕау iѕrаеl hаѕ fіrеd on thеіr bаѕеѕ deliberately. Dentist accused of killing wife allegedly wanted fake suicide notes planted. Latest sport news.