Shahrukh Khan Tv Serial: బాలీవుడ్ అగ్ర హీరో షారుఖ్‌ఖాన్ యాక్టింగ్ కెరీర్ టీవీ సీరియల్‌తోనే మొదలైంది. ఫౌజీ అనే టీవీ సీరియల్‌తో ఫస్ట్ టైమ్ కెమెరా ముందుకొచ్చాడు షారుఖ్‌ఖాన్‌.

Shahrukh Khan Tv Serial

బాలీవుడ్ బాద్‌షా షారుక్‌ఖాన్‌ తన నటనా ప్రయాణం టెలివిజన్‌ సీరియల్‌ ద్వారా మొదలుపెట్టిన విషయం చాలా మందికి తెలియదు ఆయన సినీ ప్రస్థానం 1989లో వచ్చిన “ఫౌజీ” అనే టీవీ సీరియల్‌తో ప్రారంభమైంది. ఇందులో షారుక్‌ఖాన్‌ లెఫ్టినెంట్ అభిమన్యు రాయ్ అనే ఆర్మీ ఆఫీసర్‌గా కనిపించి ప్రేక్షకుల హృదయాల్లో చోటు దక్కించుకున్నాడు. ఫౌజీ సీరియల్‌ను అప్పట్లో రాజ్ కుమార్ కపూర్ కేవలం 13 ఎపిసోడ్లతో రూపొందించారు. దూరదర్శన్‌లో ప్రసారమైన ఈ సీరియల్ అప్పటి టెలివిజన్ ప్రపంచంలో ఓ ట్రెండ్ సెట్టర్‌గా నిలిచింది. ఇందులో షారుక్‌ఖాన్‌ సెకండ్ లీడ్ రోల్‌ అయినప్పటికీ, ఆయన నటనతో ప్రేక్షకులను మెప్పించాడు. సైన్యంలోకి వచ్చిన కమాండోలకు మిలటరీ శిక్షణ ఎలా ఉంటుంది? వారు ఎదుర్కొనే కఠిన పరిస్థితులు ఏమిటి? అనే నేపథ్యంలో ఈ సీరియల్ నిర్మించబడింది దాదాపు 36 ఏళ్ల తరువాత, ఈ సీరియల్‌ మళ్లీ దూరదర్శన్‌లో రీటెలికాస్ట్ రూపంలో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. సోమవారం నుంచి శుక్రవారం మధ్యాహ్నం 12 గంటలకు ఈ సీరియల్‌ను ప్రసారం చేస్తున్నారు. అదేవిధంగా రాత్రి 11:30కి మరోసారి చూసే అవకాశాన్ని అందిస్తున్నారు.

ఫౌజీ సీరియల్ తరువాత షారుక్‌ఖాన్‌ అనేక హిందీ సీరియల్స్‌లో కనిపించాడు. దిల్ దరియా , మహాన్ కర్జ్‌, దూస్రా కేవల్ , ఇడియట్ వంటి సీరియల్స్‌లో ఆయన నటనకు మంచి గుర్తింపు వచ్చింది. ఈ టీవీ సీరియల్స్ ద్వారా వచ్చిన పాపులారిటీతోనే షారుక్‌ఖాన్‌కు దీవానా అనే సినిమాలో అవకాశాలు లభించాయి. ఈ సినిమాలో ఆయన నెగటివ్ షేడ్స్‌లో నటించి పెద్ద విజయాన్ని అందుకున్నాడు, తద్వారా సినిమాల ప్రపంచంలో స్టార్‌గా మారిపోయాడు ఫౌజీ సీరియల్‌ సీక్వెల్‌ రూపొందుతోంది. ఫౌజీ 2 పేరుతో ఈ సీరియల్‌ త్వరలో విడుదల కానుంది. ఈ సీరియల్‌లో విక్కీ జైన్, గౌహర్ ఖాన్, ఉత్కర్ష్ కోహ్లి, రుద్రా సోనీ వంటి నటులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఫౌజీ 2 సీరియల్‌ సినిమాల స్థాయిలో భారీ బడ్జెట్‌తో నిర్మించబడుతోంది. ఈ సీరియల్‌లోని పాటను ప్రముఖ గాయకుడు సోను నిగమ్ ఆలపించనున్నారు. అంతేకాక, ప్రముఖ నటుడు శరద్ ఖేల్కర్ వాయిస్ ఓవర్ అందిస్తున్నారు. ఫౌజీ 2 సీరియల్‌ను ప్రముఖ ఓటీటీ ప్లాట్‌ఫామ్‌లో స్ట్రీమింగ్‌ చేయబోతున్నారు. ఇదిలా ఉంటే, షారుక్‌ఖాన్ ఫౌజీ సీరియల్ ప్రస్తుతం అమెజాన్ ప్రైమ్‌ వీడియో మరియు జియో సినిమా ఓటీటీలలో అందుబాటులో ఉంది ఈ విధంగా, టీవీ సీరియల్‌తో మొదలైన షారుక్‌ఖాన్‌ ప్రయాణం, బాలీవుడ్‌ బాద్‌షాగా ఎదిగే వరకూ అద్భుతంగా సాగింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *