కేటీఆర్ కు భయం పట్టుకుంది – కాంగ్రెస్ విప్ ఆది శ్రీనివాస్

ప్రభుత్వ చీఫ్ విప్ ఆది శ్రీనివాస్ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ , మాజీ మంత్రి కేటీఆర్‌పై తీవ్రమైన ఆరోపణలు చేశారు. హైదరాబాద్‌లో మీడియాతో మాట్లాడుతున్న.. గత పది ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో జరిగిన అక్రమాలు, స్కాంలు వెలుగు చూస్తాయని, వాటి భయంతోనే కేటీఆర్ అప్రకటిత భయంలో ఉన్నారని ఆది శ్రీనివాస్ వ్యాఖ్యానించారు.

కేటీఆర్‌పై వివిధ ఆరోపణలపై విచారణ కొనసాగుతున్న సమయంలో కనీసం రెండు నుండి మూడు సంవత్సరాలు జైలులో ఉండటం ఖాయమని ఆయన అభిప్రాయపడ్డారు. ముఖ్యంగా.. కాళేశ్వరం ప్రాజెక్టు అవినీతి, ఫోన్ ట్యాపింగ్ వంటి వివాదాస్పద అంశాలు విచారణలో ఉన్నాయని, వాటి గురించి కేటీఆర్ తప్పుదారి పట్టించే విధంగా మాట్లాడుతున్నారని అన్నారు. రేవంత్ రెడ్డి నాయకత్వం లో కొత్త చాప్టర్ ప్రారంభమవుతుందని, భవిష్యత్తులో బీఆర్ఎస్ నేతలపై మరిన్ని చర్యలు తీసుకుంటామని సూచించారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *