హిట్ స్టేటస్కు అత్యంత దగ్గరగా విశ్వం.. ఆ ముగ్గురి టార్గెట్ కంప్లీట్ అయినట్లేనా

viswam

మ్యాచో స్టార్ గోపీచంద్ హీరోగా, మోస్ట్ బ్యూటిఫుల్ నటీమణి కావ్య దాపర్ హీరోయిన్గా శ్రీను వైట్ల దర్శకత్వంలో రూపొందిన సినిమా విశ్వం విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ సినిమాను ప్రముఖ నిర్మాత టీ జీ విశ్వప్రసాద్ పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ కింద నిర్మించారు. ఈ సినిమా విడుదలకు ముందు, గోపీచంద్, కావ్య థాపర్, శ్రీను వైట్ల మరియు టీ జీ విశ్వప్రసాద్ వంటి ప్రతిష్టితులు పలు సినిమాల్లో అపజయాలను ఎదుర్కొన్నట్లు తెలుస్తుంది. అందువల్ల, ఈ సినిమాతో మంచి విజయాన్ని సాధించాలని వారు ఆశించారు. మరి, ఈ సినిమా వారి ఆశలను నెరవేరుస్తుందా? లేదా? అనేది ఆసక్తికరంగా మారింది.

ఈ సినిమా 13 రోజుల బాక్స్ ఆఫీస్ రన్‌ను పూర్తిచేసింది, మరియు ఈ 13 రోజుల వ్యవధిలో విశ్వం మూవీ యొక్క కలెక్షన్లను పరిశీలిస్తే ఇది నైజాం ఏరియాలో 2.95 కోట్ల రూపాయలు ఆంధ్ర ఏరియాలో 4.26 కోట్ల రూపాయలు వసూలు చేసింది. ఈ విధంగా రెండు తెలుగు రాష్ట్రాలలో కలిపి మొత్తం 7.21 కోట్ల షేర్ మరియు 12.85 కోట్ల గ్రాస్ కలెక్షన్లు సమకూర్చింది అంతేకాదు కర్ణాటక రెస్ట్ ఆఫ్ ఇండియా ఓవర్సీస్ వంటి ప్రాంతాలలో మరో 75 లక్షల రూపాయలు వసూలు చేసింది దీంతో ప్రపంచవ్యాప్తంగా 13 రోజుల్లో ఈ సినిమా 7.96 కోట్ల షేర్ మరియు 14.65 కోట్ల గ్రాస్ కలెక్షన్లు సాధించింది.

ఇది మరో 2.3 కోట్ల షేర్ కలెక్షన్లను రాబడితే, ఈ చిత్రం క్లీన్ హిట్ అనే టైటిల్ పొందే అవకాశాలు ఉన్నాయి గోపీచంద్ కావ్య దాపర్ శ్రీను వైట్ల, విశ్వప్రసాద్ వంటి నటీనటులు ఈ సినిమాతో విజయాన్ని సాధించకపోయినా, తమకు కొంత ఊరట అందించినట్లు కొంత మంది అభిప్రాయపడ్డారు విశ్వం సినిమా ఇలాంటి పరిస్థితులలో కూడా, వారికి అవసరమైన ప్రోత్సాహాన్ని అందించడంలో కాపాడే పాత్ర పోషించింది.

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *