శ్రీ సీతారామచంద్రస్వామి వారిని దర్శించుకున్న తెలంగాణ గవర్నర్‌

Telangana Governor Jishnu Dev Varma visited Bhadradri Ramaiah

భద్రాచలం: తెలంగాణ గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ భద్రాచలంలోని శ్రీ సీతారామచంద్రస్వామి వారిని దర్శించుకున్నారు. ప్రధానాలయంలోని ధ్రువమూర్తుల్ని దర్శించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. తరువాత, ఆలయానికి సమీపంలోని ఆంజనేయస్వామి మరియు లక్ష్మీ తాయారు అమ్మవారిని కూడా సందర్శించారు. అనంతరం అర్చకులు గవర్నర్‌కు వేదాశీర్వచనం అందించారు. ఆలయ ఈవో రమాదేవి గవర్నర్‌కు స్వామివారి చిత్రపటం మరియు ప్రసాదాలను అందించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ జితేష్ వి పాటిల్, ఐటీడీఏ పీవో రాహుల్ గవర్నర్‌ను స్వాగతించారు. గవర్నర్‌తో కలిసి మహబూబాబాద్ ఎంపీ బలరాం నాయక్ మరియు భద్రాచలం ఎమ్మెల్యే డాక్టర్ తెల్లం వెంకట్రావు కూడా స్వామివారిని దర్శించుకున్నారు.

ఆలయ పూజా కార్యక్రమాల అనంతరం, గవర్నర్ ఖమ్మం జిల్లాకు వెళ్లి జిల్లా అధికారులతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా పరిస్థితులు, అభివృద్ధి ప్రణాళికలపై చర్చించినట్లు తెలుస్తోంది. గవర్నర్ జిల్లాకు చెందిన ప్రముఖ కవులు, రచయితలు, కళాకారులు, రాష్ట్ర, జాతీయ అవార్డులు పొందిన వారు వంటి సాంస్కృతిక ప్రతినిధులతో సమావేశమయ్యారు. ఈ భేటీలో సాహిత్యం, కళలు, సాంస్కృతిక అంశాలపై చర్చ జరిగినట్లు సమాచారం.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *