జగన్ మరోసారి చంద్రబాబు ఫై నిప్పులు చెరిగారు. నేడు విజయనగరం జిల్లాలో డయేరియా తో మరణించిన కుటుంబాలను ఆయన పరామర్శించారు. ఈ సందర్బంగా జగన్ మాట్లాడుతూ.. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీల్లో సీఎం చంద్రబాబు ఒక్కటి కూడా నెరవేర్చలేదని విమర్శించారు.
ప్రభుత్వ వైఫల్యాలపై ప్రజల దృష్టిని డైవర్ట్ చేయడానికే లడ్డూ అంశాన్ని తెరపైకి తెచ్చారని ఆరోపించారు. గుర్లలో డయేరియాతో చనిపోయిన 14 మంది కుటుంబాలకు రూ.2లక్షల చొప్పున ఆర్థిక సాయం చేస్తామని ప్రకటించారు. ‘మదనపల్లిలో ఫైల్స్ తగలబడితే DGPని పంపారు. ఇక్కడ ప్రాణాలు పోతుంటే ఒక్క మంత్రి కూడా రాడు’ అని మండిపడ్డారు.