Zimbabwe: టీ20ల్లో జింబాబ్వే ప్ర‌పంచ రికార్డు.. రోహిత్ రికార్డు బ్రేక్ చేసిన సికంద‌ర్ ర‌జా

Zimbabwe

టీ20 ప్రపంచ కప్ ఆఫ్రికా సబ్-రిజినల్ క్వాలిఫయర్స్‌లో జింబాబ్వే గాంబియాపై సంచలన విజయాన్ని నమోదు చేసింది బుధవారం నైరోబీలోని రురాకా స్పోర్ట్స్ క్లబ్ గ్రౌండ్‌లో జరిగిన ఈ మ్యాచ్‌లో జింబాబ్వే జట్టు పూర్తి ఆధిపత్యం ప్రదర్శించింది నిర్ణీత 20 ఓవర్లలో ఏకంగా 344 పరుగుల భారీ స్కోర్ సాధించడం ద్వారా టీ20 అంతర్జాతీయ క్రికెట్ చరిత్రలో అత్యధిక స్కోరు నమోదు చేసింది ఈ రికార్డు గాంబియాపై విజయంతో మరోసారి జింబాబ్వే ప్రతిభను ప్రపంచానికి చూపించింది జింబాబ్వే 344 పరుగులు చేసి, గతేడాది హాంగ్‌జౌలో నేపాల్ జట్టు మంగోలియాపై నమోదు చేసిన 314-3 అత్యధిక స్కోరు రికార్డును అధిగమించింది జింబాబ్వే జట్టు కెప్టెన్ సికందర్ రజా అసాధారణ ఆటతో ఆకట్టుకున్నాడు 43 బంతుల్లోనే 133 పరుగులు సాధించి నాటౌట్‌గా నిలిచాడు. అతని ఇన్నింగ్స్‌లో 7 ఫోర్లు 15 సిక్సర్లు ఉన్నాయి సికందర్ రజా 33 బంతుల్లోనే సెంచరీ పూర్తి చేయడం విశేషం ఇది టీ20 అంతర్జాతీయ క్రికెట్‌లో రెండవ వేగవంతమైన శతకం.

సికందర్ రజా ఈ సందర్భంగా నమీబియా ఆటగాడు జాన్ నికోల్ లాఫ్టీ ఈటన్‌తో సమంగా నిలిచాడు ఈటన్ కూడా గతంలో 33 బంతుల్లోనే శతకం సాధించిన రికార్డు ఉన్నాడు ప్రస్తుతం వేగవంతమైన సెంచరీ రికార్డు ఎస్టోనియా ఆటగాడు సాహిల్ చౌహాన్ పేరిట ఉంది ఈ ఏడాది జూన్‌లో సైప్రస్‌పై 27 బంతుల్లోనే చౌహాన్ శతకం సాధించాడు జింబాబ్వే సాధించిన 345 పరుగుల భారీ లక్ష్యాన్ని ఛేదించడానికి బరిలోకి దిగిన గాంబియా జట్టు జింబాబ్వే బౌలర్లదెబ్బకు కేవలం 14.4 ఓవర్లలోనే 54 పరుగులకే ఆలౌట్ అయింది ఈ విజయంతో జింబాబ్వే 290 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది ఇది టీ20 అంతర్జాతీయ క్రికెట్‌లో ఇప్పటివరకు నమోదైన అత్యధిక విజయ తేడా .

జింబాబ్వే కెప్టెన్ సికందర్ రజా ఈ మ్యాచ్‌లో కొత్త రికార్డులను నెలకొల్పాడు. టెస్ట్ హోదా కలిగిన దేశాల క్రికెటర్లలో వేగవంతమైన శతకం (33 బంతుల్లో) సాధించిన క్రికెటర్‌గా రోహిత్ శర్మ (35 బంతుల్లో శతకం) మరియు డేవిడ్ మిల్లర్‌ల రికార్డును బద్దలు కొట్టాడు.

    Leave a Reply

    Your email address will not be published. Required fields are marked *