చేతన్ కృష్ణ హెబ్బా పటేల్ జంటగా నటించిన తాజా చిత్రం ధూం ధాం ప్రేక్షకుల్లో ఆసక్తిని రేకెత్తిస్తోంది ఈ చిత్రానికి సాయి కిషోర్ మచ్చా దర్శకత్వం వహించగా ఎం.ఎస్ రామ్ కుమార్ నిర్మించారు ఈ సినిమాలో సీనియర్ నటుడు సాయి కుమార్ వెన్నెల కిషోర్ పృథ్వీరాజ్ గోపరాజు రమణ కీలక పాత్రల్లో నటిస్తున్నారు గోపీ మోహన్ ఈ చిత్రానికి కథ స్క్రీన్‌ప్లే అందించారు అతని కథ రాస్తున్నా దర్శకత్వం వేరే కావడం ప్రత్యేక ఆకర్షణగా మారింది ఇటీవలే ఈ మూవీ టీజర్‌ను ప్రముఖ దర్శకుడు మారుతి విడుదల చేయగా అందరి నుండి మంచి స్పందన లభించింది టీజర్‌లో హీరో-హీరోయిన్ల మధ్య లవ్ స్టోరీను కేవలం చూపించడమే కాదు తండ్రి-కొడుకుల మధ్య ఉన్న భావోద్వేగాలను కూడా ప్రతిబింబించడం ప్రేక్షకుల్లో సినిమాపై మరింత ఆసక్తిని పెంచింది.
టీజర్‌లో చేతన్ కృష్ణ చేసిన గ్రామీణ బ్యాక్‌డ్రాప్ యాక్షన్ సీక్వెన్స్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది వెన్నెల కిషోర్ కామెడీ ట్రాక్ పెళ్లి సందడి సన్నివేశాలు హాస్యాన్ని పెంచాయి లవ్ ఫ్యామిలీ ఎమోషన్ యాక్షన్ కామెడీతో పాటు గోపీ సుందర్ అందించిన సంగీతం టీజర్‌ను మరింత సమృద్ధిగా మార్చింది సినిమా నవంబర్ 8న విడుదల కానుంది ధూం ధాం సినిమా ప్రేమకథ కుటుంబ సంబంధాలు హాస్యం మరియు యాక్షన్ మేళవించి అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకునేలా రూపొందించారు.