సమంత మరియు నాగ చైతన్య వీరిమధ్య విడాకులు గురించి తరచూ సోషల్ మీడియాలో చర్చలు జరుగుతూనే ఉంటాయి వీరిద్దరి విడాకులకు కారణం ఏమిటి అన్నది ఎంతో మందికి ఆసక్తి కలిగిస్తోంది ముఖ్యంగా నాగ చైతన్య విడాకుల తరువాత ప్రముఖ నటి శోభిత దూళిపాళ్లతో అతడి పేరు ఎక్కువగా తెరపైకి రావడంతో ఈ చర్చలు మరింత వేడెక్కాయి నాగ చైతన్య శోభిత దూళిపాళ్ల ఇద్దరూ కలిసి అనేక ప్రైవేట్ ఈవెంట్లలో కనిపించడం వారిద్దరి నిశ్చితార్థం విషయాలు మీడియాలో చక్కర్లు కొట్టడంతో ఈ విడాకుల వెనుక అసలు కారణం ఏమై ఉండొచ్చని చాలామంది ప్రశ్నిస్తున్నారు నాగ చైతన్య విడాకుల తరువాత చాలా త్వరగానే శోభితతో అతడు కలిసిపోవడం వీరి వ్యక్తిగత జీవితం గురించి రకరకాల కథనాలు ప్రచారంలోకి రావడం ఇలా నిత్యం సోషల్ మీడియాలో వారిద్దరి గురించి చర్చలు జరుగుతున్నాయి.
ఈ చర్చల నడుమ సమంత రీసెంట్‌గా ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో చెప్పిన మాటలు కూడా మరింత అర్థవంతంగా మారాయి రాజ్ & డీకే దర్శకత్వం వహించిన సిటాడెల్ సిరీస్ ప్రమోషన్స్ లో పాల్గొన్న సమంతకు ఒక యాంకర్ ప్రశ్న అడిగాడు ఈ సిరీస్ లో మీరు స్పై ఏజెంట్ గా నటించారు కదా నిజ జీవితంలో కూడా మీకు ఎలాంటి స్పై సమర్థత ఉంది అని అడగగా సమంత స్పందిస్తూ నిజ జీవితంలో కూడా నాకు స్పైలా వ్యవహరించాల్సింది కానీ నేను అలా చేయలేదు ఆ తప్పిదం వల్లే నా జీవితం ఇలా తయారైంది అని చెప్పింది సమంత వ్యాఖ్యలు ఆమె వ్యక్తిగత జీవితానికి సంబందించి ఉంటాయని నెటిజన్లు అనుకుంటున్నారు వీరి విడాకులకు నాగ చైతన్య శోభిత మధ్య ఉన్న సంబంధం కారణమా అన్న అనుమానాలు ఈ వ్యాఖ్యలతో మళ్లీ చర్చకు వస్తున్నాయి ఇక శోభిత ప్రస్తుతం తన వివాహం ఏర్పాట్లలో బిజీగా ఉంది నిన్న వైజాగ్‌లో జరిగిన హిందూ సంప్రదాయ కార్యక్రమాల్లో ఆమె పాల్గొంది శోభిత నాగ చైతన్య వివాహం నవంబర్ లేదా డిసెంబర్‌లో జరిగే అవకాశం ఉందని సమాచారం.