కార్తికేయ, హనుమాన్‌, కల్కి కోవలోనే రహస్యం ఇదం జగత్‌ : దర్శకుడు కోమల్‌ ఆర్‌.భరద్వాజ్‌

rahasyam idam jagath

మన పురాణాలు, ఇతిహాసాలు, శ్రీచక్రం వంటి ఆధ్యాత్మిక అంశాల చుట్టూ తిరిగే కథతో ప్రేక్షకులకు కొత్త అనుభూతిని పంచబోతున్న సినిమా “రహస్యం ఇదం జగత్‌ నవంబర్ 8న విడుదలకు సిద్ధంగా ఉన్న ఈ చిత్రం ఇప్పటికే ఆసక్తి రేపుతోంది ముఖ్య నటీనటులుగా రాకేష్ గలేబి స్రవంతి పత్తిపాటి మానస వీణ భార్గవ్ గోపీనాథం నటిస్తున్న ఈ చిత్రాన్ని సింగిల్ సెల్ యూనివర్సల్ ప్రొడక్షన్ పతాకంపై కోమల్ ఆర్ భరద్వాజ్ దర్శకత్వం వహిస్తుండగా పద్మ రావినూతుల హిరణ్య రావినూతుల నిర్మిస్తున్నారు ఈ చిత్రం టీజర్‌ను అమెరికాలో డల్లాస్‌లో విడుదల చేయగా ఆ టీజర్‌కు మంచి స్పందన లభించింది ఈ సందర్భంగా జరిగిన మీడియా సమావేశంలో దర్శకుడు కోమల్ ఆర్ భరద్వాజ్ మాట్లాడుతూ “సైన్స్ ఫిక్షన్‌తో మైథాలాజికల్ అంశాలను కలిపి నేటి తరం ప్రేక్షకులను ఆకట్టుకునే విధంగా ఈ చిత్రాన్ని రూపొందించాం విజువల్స్‌ అత్యద్భుతంగా ఉంటాయి ప్రేక్షకులకు కొత్త అనుభవాన్ని అందిస్తాయి శ్రీచక్రం ప్రేరణతో కథను తీర్చిదిద్దాం ఈ చిత్రం కల్కి హనుమాన్ కార్తికేయ లాంటి పాత పురాణ గాధలను ఆధారంగా చేసుకుని రూపొందించిన మైథాలాజికల్ చిత్రాల్లో ఒకటిగా నిలుస్తుంది” అని తెలిపారు.

ఆయన ఇంకా పేర్కొంటూ “మన పురాణాలు, మౌలిక గాధలను ఆధారంగా చేసుకుని తెలుగు ప్రేక్షకులకు ఈ చిత్రంతో కొత్త విషయాలను చెప్పబోతున్నాం 1998లో ‘పడమటి రాగం వెన్నెల’ చిత్రాల తరువాత ఇలాంటి సినిమా వస్తుండటం ఎంతో ఆనందంగా ఉంది ఈ జనరేషన్‌కు సరిగ్గా సరిపోయే కంటెంట్ కొత్త ప్రపంచంలోకి ప్రేక్షకులను తీసుకెళ్తుంది మా నమ్మకంతో ఈ సినిమా ప్రేక్షకులను మెప్పిస్తుందని ఆశిస్తున్నాం అన్నారు హీరోయిన్ మానస మాట్లాడుతూ “ఈ సినిమా అవకాశాన్ని ఇచ్చిన కోమల్ గారికి చాలా కృతజ్ఞతలు అమెరికాలో ఫుల్‌టైమ్ పని చేస్తూ సినిమాల పట్ల ఉన్న నా ప్యాషన్‌ను సాకారం చేసుకోవడం చాలా సంతోషంగా ఉంది ఈ చిత్రం ప్రతీ ఒక్కరిని ఆకట్టుకుంటుందని నాకు నమ్మకముంది అన్నారు రహస్యం ఇదం జగత్” సినిమా కేవలం ఒక వినోదాత్మక చిత్రం మాత్రమే కాకుండా తెలుగు ప్రేక్షకులకు మన పురాణాలు ఇతిహాసాల పట్ల గౌరవాన్ని పెంచేలా రూపొందించబడింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *