పాకిస్థాన్ స్టార్ క్రికెటర్ బాబర్ ఆజం ప్రస్తుతం తన ఫామ్ కోల్పోయి తీవ్ర ఇబ్బందులు పడుతున్నాడు గత కొంతకాలంగా టెస్టుల్లో నిరాశాజనక ప్రదర్శన చేయడం వల్ల చివరకు జట్టులో తన స్థానం కూడా కోల్పోయాడు పాకిస్థాన్ జట్టు ప్రస్తుతం ఇంగ్లాండ్‌తో స్వదేశంలో మూడు మ్యాచ్‌ల టెస్టు సిరీస్ ఆడుతోంది. ముల్తాన్ వేదికగా జరిగిన తొలి టెస్టులో పాకిస్థాన్ భారీ పరాజయం చవిచూసిన నేపథ్యంలో పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) బాబర్ ఆజంతో పాటు పేసర్లు షాహీన్ ఆఫ్రిది నసీమ్ షాలను మిగిలిన రెండు టెస్టులకు జట్టు నుండి తప్పించింది పీసీబీ ఈ నిర్ణయాన్ని తీసుకోవడానికి ప్రధాన కారణం ఈ ఆటగాళ్లు జట్టుకు అనుకూలించకపోవడమే ఒకప్పుడు జట్టుకు కీలక బలం అయిన బాబర్ ఆజం ప్రస్తుతం ఒక భారంగా మారడం బోర్డు అధికారులను నిరాశపర్చింది ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో బాబర్ ఆజంకు పునరాగమనానికి భారత మాజీ క్రికెటర్ వీరేంద్ర సెహ్వాగ్ ఒక కీలక సలహా ఇచ్చాడు దేశవాళీ క్రికెట్ ఆడాలని తన ఫిట్‌నెస్‌పై మరింత దృష్టి పెట్టాలని సూచించాడు బాబర్ ఇప్పుడు దేశవాళీ క్రికెట్ ఆడాలని ఫిట్‌నెస్ విషయంలో మరింత శ్రద్ధ వహించాలని సూచిస్తున్నాను అంతేకాకుండా కుటుంబంతో కొంత సమయం గడపడం ద్వారా శారీరకంగా మానసికంగా దృఢంగా మారి, అంతర్జాతీయ క్రికెట్‌కు తిరిగి రావాలి అని సెహ్వాగ్ పేర్కొన్నాడు.
సెహ్వాగ్ మాత్రమే కాకుండా పాకిస్థాన్ మాజీ పేసర్ షోయబ్ అక్తర్ కూడా ఈ విషయంపై తన అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తూ బాబర్ మానసిక దృఢతను పెంపొందించుకోవాల్సిన అవసరముందని తెలిపాడు బాబర్‌కి ఈ సమయంలో మానసికంగా బలంగా ఉండటం చాలా అవసరం ఫామ్ లేకపోవడం కెప్టెన్సీని వదిలిపెట్టడం వంటి అంశాలు అతని మానసిక స్థితిపై తీవ్రమైన ప్రభావం చూపుతున్నాయి టెక్నికల్ సమస్యల కంటే మానసిక పరిస్థితి అతని ఆటలో ఎక్కువ ప్రభావం చూపిస్తోంది అని అక్తర్ అన్నాడు బాబర్ మునుపటి ఫామ్‌ను త్వరగా తిరిగి పొందాలంటే మానసిక దృఢతతో పాటు ఫిట్‌నెస్‌కు ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరం ఉందని చెప్పాడు బాబర్ ఆజం గత ఏడాది నుంచి టెస్టు క్రికెట్లో తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నాడు 2022 డిసెంబర్ 26న న్యూజిలాండ్‌తో కరాచీ వేదికగా జరిగిన టెస్టులో 161 పరుగులతో చేసిన శతకం తర్వాత 18 ఇన్నింగ్స్‌లు ఆడినా ఒక్క అర్ధశతకం కూడా నమోదు చేయలేదు టెస్టుల్లో అతని ఈ విధమైన ఘోర ఫామ్ కింద పడటం పాకిస్థాన్ జట్టును కూడా తీవ్రంగా దెబ్బతీసింది ముల్తాన్ వేదికగా ఇంగ్లాండ్‌తో జరిగిన మొదటి టెస్టులో పాకిస్థాన్ ఇన్నింగ్స్ మరియు 47 పరుగుల తేడాతో ఓడిపోవడంలో బాబర్ 30, 5 పరుగులతో విఫలమయ్యాడు ఈ పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని పీసీబీ రెండవ టెస్టుకు బాబర్ స్థానంలో కొత్త ఆటగాడు కమ్రాన్ గులామ్‌ను జట్టులోకి తీసుకుంది. అతను అరంగేట్ర మ్యాచ్‌లోనే సెంచరీ (118) సాధించి తన ప్రతిభను నిరూపించుకున్నాడు ఈ మ్యాచ్‌లో పాకిస్థాన్ అద్భుత ప్రదర్శన కనబరిచి 152 పరుగుల తేడాతో విజయం సాధించి స్వదేశంలో గత 11 టెస్టు మ్యాచ్‌ల ఓటమి పరంపరను ముగించింది చివరి టెస్టులో కూడా పాక్ విజయం సాధించి ఇంగ్లాండ్‌పై చారిత్రాత్మక సిరీస్ విజయాన్ని నమోదు చేయాలని ఉవ్విళ్లూరుతోంది బాబర్ ఆజం వంటి ప్రతిభావంతులైన ఆటగాళ్లు ప్రతికూల పరిస్థితులను ఎదుర్కొన్నప్పటికీ వీలైనంత త్వరగా పుంజుకుంటారని క్రికెట్ పండితులు భావిస్తున్నారు.