Ananya Nagalla: హీరోయిన్‌లు కమిట్‌మెంట్‌ ఇస్తే ఒక పారితోషికం, లేకపోతే మరో పారితోషికం ఉంటుందా?అనన్య నాగళ్లకు జర్నలిస్ట్‌ ప్రశ్న

Ananya Nagalla

ఇటీవల కాలంలో తెలుగు చిత్ర పరిశ్రమతో పాటు ఇతర సినీ రంగాల్లో కూడా క్యాస్టింగ్ కౌచ్‌ అనే అంశం హాట్‌టాపిక్‌గా మారింది క్యాస్టింగ్ కౌచ్‌ గురించి పలు ప్రముఖ నటీమణులు తమ అనుభవాలను బహిరంగంగా పంచుకుంటున్నారు వారు సినీ పరిశ్రమలో ఎదుర్కొన్న సవాళ్లను ఆచరణల్లోని బలహీనతలను సమాజానికి తెలియజేస్తున్నారు ఈ సందర్భంలోనే ఇటీవల జరిగిన పొట్టేల్ సినిమా ట్రైలర్ విడుదల కార్యక్రమంలో అనన్య నాగళ్ల అనే హీరోయిన్‌తో జర్నలిస్టు ప్రశ్నోత్తరాల సమయంలో ఆసక్తికరమైన సంభాషణ చోటు చేసుకుంది జర్నలిస్టు తన ప్రశ్నలో సినీ పరిశ్రమలో క్యాస్టింగ్ కౌచ్‌పై ఉన్న పుకార్లను ప్రస్తావిస్తూ తెలుగమ్మాయిలు చిత్ర పరిశ్రమకు రావడానికి భయపడుతున్నారని దీనికి ప్రధాన కారణం క్యాస్టింగ్ కౌచ్ అని వ్యాఖ్యానించారు అంతేకాక తెలుగు సినీ పరిశ్రమలో అవకాశం పొందాలంటే మొదట కమిట్‌మెంట్ అడుగుతారని ఇది వాస్తవమా అని ప్రశ్నించారు ఆయన ఇంకా అడిగారు మీరు సైన్ చేసే ఒప్పందంలో కూడా కమిట్‌మెంట్ అంశం ఉంటుందా? కమిట్‌మెంట్ ఇస్తే ఒక రెమ్యూనరేషన్ ఇవ్వకపోతే మరో రెమ్యూనరేషన్ ఉంటుందా అని

ఈ ప్రశ్నకు అనన్య నాగళ్ల సరైన సమాధానం ఇచ్చారు ఆమె తన అనుభవాలను పంచుకుంటూ మీరు ఇంత కచ్చితంగా ఈ విషయం ఎలా చెప్పగలరు అని కౌంటర్ ప్రశ్నను దూకుగా అడిగారు ఆమె అభిప్రాయ ప్రకారం ప్రతి పరిశ్రమలోనూ పాజిటివ్ మరియు నెగెటివ్ అంశాలు ఉంటాయి కానీ మనం నెగెటివ్‌ను మాత్రమే ఎందుకు చూస్తున్నాం అని ప్రశ్నించారు ఆమె సినీ పరిశ్రమలో తనకు ఇలాంటి ఎలాంటి అనుభవం ఎదురుకాలేదని స్పష్టం చేసింది ఒక అవకాశాన్ని పొందడానికి కమిట్‌మెంట్ అడగటం 100% తప్పు అని ఆమె పేర్కొన్నారుఈ సంభాషణ పొట్టేల్ ట్రైలర్ కార్యక్రమం సమయంలో జరిగింది, ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వేగంగా వైరల్ అవుతోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This will close in 10060 seconds