వాడిన టీ పొడి వల్ల అనేక ప్రయోజనాలు

Tea powder

టీ ప్రపంచంలో అత్యంత ప్రాచుర్యం పొందిన పానీయాలలో ఒకటి. భారతీయులకు దీనిని బ్రిటిష్ వారు పరిచయం చేసారు. భారత నేల మరియు వాతావరణం ఈ మొక్కల పెంపకానికి అత్యంత అనుకూలమని గుర్తించారు . అయితే
టీ తయారు చేసిన తరువాత మిగిలిన టీ పొడిని అనేక రకాలుగా ఉపయోగించుకోవచ్చు .

  1. కంపోస్ట్: వాడిన టీ పొడిని మట్టి మిగిలిపోయిన కూరగాయల తో కలిపి పెట్టడం ద్వారా కంపోస్ట్ తయారవుతుంది. ఈ కంపోస్ట్ మొక్కలకి సహజమైన ఎరువుగా పని చేస్తుంది.
  2. పరికరాల శుభ్రత: టీ పొడిని బేకింగ్ సోడాతో కలిపి బాత్రూమ్ మరియు కిచెన్ పరికరాలను శుభ్రం చేయడానికి ఉపయోగిస్తారు. ఇది నూనె మరియు మరకలను సులభంగా తొలగిస్తుంది.
  3. చర్మ సంరక్షణ: వాడిన టీ పొడిని చర్మానికి స్క్రబ్ లేదా మాస్క్‌గా ఉపయోగించవచ్చు. ఇది చర్మాన్ని తాజాగా ఉంచడం మరియు చర్మ సమస్యలను తగ్గించడంలో సహాయపడుతుంది.
  4. వాసన తొలగించడం: టీ పొడిని ఫ్రిజ్ లో ఉంచడం ద్వారా చెడు వాసన ను తొలగించవచ్చు.
  5. కీటకాలు దూరం: మొక్కల చుట్టూ వాడిన టీ పొడిని చల్లడం ద్వారా కీటకాలను దూరం చేయవచ్చు. ఇది సహజ రసాయనం గా పనిచేస్తుంది.

ఈ విధంగా, వాడిన టీ పొడిని పునః ఉపయోగించడం వలన మన పనులను సులభం చేస్కోడమే కాకుండా ఖర్చు కూడా ఆదా చేసుకోవచ్చు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *