ఏపీలో అందుబాటులోకి వచ్చిన రూ.99 ల క్వార్టర్ మందు

ఏపీలో అధికారంలోకి వచ్చిన చంద్రబాబు..ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చే పనిలో ఉన్నారు. ఇప్పటికే పలు హామీలను నెరవేర్చగా తాజాగా మందుబాబుల కోరిక కూడా తీర్చాడు. ఇటీవలే కొత్త మద్యం పాలసీని తీసుకొచ్చారు. నాణ్యమైన మందు..నాణ్యమైన ధరల్లో అందుబాటులోకి తీసుకొచ్చి మందుబాబుల్లో సంతోషం నింపారు. గత ఐదేళ్లుగా మంచి ముందుకు నోచుకోలేని వారు..ఇప్పుడు కావలసిన మందు లభ్యం అవుతుండడం తో సంబరాలు చేసుకుంటున్నారు.

అలాగే రూ.99కే క్వార్టర్ బాటిల్ మద్యాన్ని అందుబాటులోకి తీసుకువచ్చినట్లు ఎక్సైజ్ శాఖ డైరెక్టర్ నిషాంత్ కుమార్ తెలిపారు. ఇప్పటికే 10 వేల కేసుల మద్యం దుకాణాలకు చేరిందని, ఈ నెల 21 నాటికి మరో 20 వేల కేసులు చేరుతుందని వివరించారు. రూ.99కే క్వార్టర్ బాటిల్ను ఐదు ప్రముఖ సంస్థలు సరఫరా చేస్తున్నట్లు వెల్లడించారు. నెలాఖరునాటికి మరింత స్టాక్ అందుబాటులో ఉంచుతామని తెలిపారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *