తల్లితండ్రులు పిల్లల భద్రత కోసం నిరంతరం ఆందోళన పడుతూ ఉంటారు . కానీ ఎంత జాగ్రత్త వహించిన కొన్నిసార్లు అనుకోకుండా ప్రమాదాలు జరుగుతూ ఉంటాయి . ముఖ్యంగా వారు ఆటలు ఆడే సమయం లో వాళ్ళకి తెలియకుండా నే ప్రమాదం లో పడిపోతూ ఉంటారు. ఇలా పిల్లలు ప్రమాదాల బారీన పడకుండా వాళ్ళ భద్రతకు అనేక ఉత్పత్తులు అందుబాటులో ఉన్నాయి, ఇవి ప్రమాదాలు జరగకుండా, పిల్లల్ని ఎప్పటికప్పుడు కనిపెట్టుకుంటూ ఉండేందుకు ఉపయోగపడతాయి.
ఇంట్లో పిల్లల భద్రతకు జాగ్రత్తలు:
ఇంట్లో ఉన్న విద్యుత్ పరికరాలను పిల్లలకు అందుబాటులో ఉండనీయకుండా చూడాలి. తీగలను మరియు ఎలక్ట్రిక్ సాకెట్లను పిల్లలు తాకకుండా చూడాలి. కత్తులు, కాచి ఉన్న పాత్రలు, మందులు వంటి ప్రమాదకర వస్తువులను పిల్లలకు అందని ప్రదేశంలో ఉంచాలి. బాత్ టబ్ మరియు వాటర్ బకెట్లను ఎల్లప్పుడూ ఖాళీగా ఉంచాలి, ఎందుకంటే చిన్న పిల్లలు నీటిలో జారిపడవచ్చు. తలుపులు, విండోలు వేగంగా మూయకుండా చూడటం ద్వారా పిల్లలకు గాయాలు అవకుండా కాపాడవచ్చు.పిల్లలు పడుకునే మంచం గోడకి దగ్గరగా ఉంచి కింద పడే ప్రమాదం నివారించాలి.
పిల్లల రక్షణ ఉత్పత్తులు:
- ఎలక్ట్రిక్ సాకెట్ కవర్స్: పిల్లలు అనుకోకుండా వారి చేతులను సాకెట్ లలో పెడుతూ ఉంటారు . దానివల్ల షాక్ కొట్టే ప్రమాదం జరుగుతుంది . అలా జరగకుండా ఉండేందుకు తల్లిదండ్రులు “బేబీ సాకెట్ గార్డ్” వంటి రక్షణ పరికరాలను ఉపయోగించడం చాలా అవసరం. ఇది అధిక నాణ్యత కలిగిన ప్లాస్టిక్‌తో తయారు చేయబడుతుంది. మరియు ఇది పూర్తిగా పిల్లలకు సురక్షితం. మీరు దీన్ని Amazon, Flipkart లేదా మీ స్థానిక స్టోర్లలో కొనుగోలు చేయవచ్చు. ఇది పిల్లల భద్రత కోసం అత్యంత శ్రద్ధతో రూపొందించబడింది.
- కేబినెట్ లాక్స్ : రసాయనాలు లేదా మందులు ఉన్న క్యాబినెట్లు తాళం వేసి పెట్టడం వల్ల పిల్లలు వాటిని తాకకుండా ఉంటారు.
- కార్నర్ కవర్లు : ఫర్నిచర్ యొక్క కఠినమైన మూలలను పిల్లలు తాకితే గాయాలు కావచ్చు. కార్నర్ కవర్లు ఈ ప్రమాదాన్ని నివారిస్తాయి.
- సేఫ్టీ గేట్స్ : మెట్ల దగ్గర లేదా ఇతర ప్రమాదకర ప్రాంతాల్లో పిల్లలు వెళ్ళకుండా సేఫ్టీ గేట్స్ వాడుకోవచ్చు.కిచెన్ లోకి రావడం వల్ల వేడిగా ఉన్న వంట పాత్రలను ముట్టుకోవడం,కారం,మసాలా వంటి పదార్ధాలను ముట్టుకొని అవే చేతులను కళ్ళలో పెట్టుకొనే వంటి ప్రమాదాలు జరుగుతాయి అందువల్ల పిల్లల్ని వంటింట్లోకి రాకుండా చూసుకోవాలి.
- బేబీ మానిటర్స్: పిల్లలు ఒంటరిగా ఉన్నప్పుడు వారి పై నిఘా వేసేందుకు బేబీ మానిటర్స్ ఉపయోగపడతాయి.
ఇవే కాకుండా, పెద్దవారు ఎప్పటికప్పుడు పిల్లలపై నిఘా పెట్టడం, పిల్లలకు ప్రమాదాల గురించి అవగాహన కల్పించడం అవసరం. ఇంట్లో పిల్లల భద్రతకై తీసుకునే ఈ చిట్కాలు పిల్లల భద్రతను మెరుగుపరుస్తాయి.