క్యాట్ కీలక తీర్పు..వారంతా ఏపీకి వెళ్లాల్సిందే

ఐఏఎస్‌(CAT)ల పిటిషన్లపై ఐదుగురు ఐఏఎస్‌(IAS)లకు షాక్ ఇస్తూ క్యాట్ కీలక తీర్పు వెలువరించింది. రాష్ట్ర పునర్విభజన సందర్భంగా జరిగిన కేటాయింపుల ప్రకారం ఆయా రాష్ట్రాలకు వెళ్లాలంటూ ఈ నెల 9న కేంద్రం జారీ చేసిన ఉత్తర్వులను రద్దు చేయాలని కోరుతూ ఐఏఎస్ అధికారులు వాకాటి కరుణ, కె.ఆమ్రపాలి, ఎ. వాణీప్రసాద్, డి. రొనాల్డ్స్, జి.సృజనలు పిటిషన్ వేయగా వారికీ షాక్ ఇచ్చింది.

రేపు ఎక్కడివాళ్లు అక్కడ రిపోర్ట్ చేసి తీరాలని ఆదేశాలు ఇచ్చింది. అంతకుముందు క్యాట్‌లో కీలక వాదనలు కొనసాగాయి. IAS అధికారులపై క్యాట్‌ కీలక వ్యాఖ్యలు చేసింది. ఏపీలో వరదలతో ప్రజలు ఇబ్బందిపడుతున్నారు, వారికి సేవచేయాలని లేదా? అని ప్రశ్నించింది.

స్థానికత ఉన్నప్పటికీ, స్వాపింగ్‌ చేసుకోవచ్చని గైడ్‌లైన్స్‌లో ఉందా? అని అడిగింది. ఐఏఎస్‌ల కేటాయింపుపై డీఓపీటీకి నిర్ణయం తీసుకునే అధికారం ఉందని గుర్తుచేసింది. వన్‌ మెన్‌ కమిటీ సిఫారసులను డీఓపీటీ ఎలా అమలు చేస్తుంది. వన్‌ మెన్‌ కమిటీ సిఫారసు చేసినప్పుడు ఎందుకు హైకోర్టుకు వెళ్లలేదని ఐఏఎస్‌లను క్యాట్‌ ప్రశ్నించింది.

ప్రస్తుతం తెలంగాణలో పనిచేస్తున్న వాకాటి కరుణ, ఆమ్రపాలి, వాణీప్రసాద్, రొనాల్డ్ రాస్లు కేంద్రం జారీ చేసిన ఉత్తర్వుల ప్రకారం ఏపీకి వెళ్లాల్సి ఉంది. ప్రస్తుతం ఏపీలో పనిచేస్తున్న సృజన తెలంగాణకు రావాల్సి ఉంది. ప్రస్తుతం తాము పనిచేస్తున్న రాష్ట్రంలోనే కొనసాగించేలా ఉత్తర్వులు జారీ చేయాలని, కేంద్రం జారీ చేసిన కేటాయింపు ఉత్తర్వులను రద్దు చేయాలని పిటిషన్లో కోరారు. కేటాయింపుల సమయంలో కేంద్రం తమ అభ్యర్థనలను పరిగణనలోకి తీసుకోలేదని తెలిపారు.

పిటిష‌నర్ల త‌రుపున క్యాట్ ముందు త‌మ వాద‌న‌లు వినిపించారు.. అనంత‌రం వారి పిటిషన్ లు కొట్టివేస్తూ,టివోపిటీ ఆదేశాల‌ను పాటించాల్సిందేన‌ని,దీనిపై ఎటువంటి మిన‌హాయింపులు లేవ‌ని క్యాట్ తుదితీర్పు ఇచ్చింది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This will close in 10060 seconds