18 ఏళ్లుగా ఎలాంటి ఆటంకంలేకుండా అలయ్ బలయ్ ని ఘనంగా అలయ్ బలయ్ నిర్వహిస్తున్నారు. ఈ ఏడాది 19వ అలయ్ బలయ్ ని నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్ వేదికగా ఈ నెల 13న నిర్వహించబోతున్నారు.
కాగా ఈ సారి ఈ కార్యక్రమాన్ని బండారు దత్తాత్రేయ కుమార్తే బండారు విజయ లక్ష్మీ నిర్వహిస్తున్నారు. ఈ నెల 13 న ఎగ్జిబిషన్ గ్రౌండ్స్‌లో జరిగే అలయ్ బలయ్ కార్యక్రమంలో పాల్గొనాలని ఇప్పటికే పలువురికి ఆహ్వానం పలికిన విజయ లక్ష్మీ.. ఈ రోజు ఉదయం తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిని కలిశారు. జూబ్లీహిల్స్ నివాసంలో ముఖ్యమంత్రి గారిని కలిసి అలయ్ బలయ్ ఆహ్వాన పత్రిక అందజేశారు. ఈ సందర్భంగా హైదరాబాద్ నగరంలో ఆనవాయితీగా వస్తున్న ఈ అలయ్ బలయ్ కార్యక్రమానికి హాజరు కావాలని బండారు విజయ లక్ష్మీ సీఎం రేవంత్ రెడ్డిని ఆహ్వానించారు.
తెలంగాణ సంస్కృతీ, సంప్రదాయాలను కొనసాగిస్తూనే.. ఫోటో ఎగ్జిబిషన్ రూపంలో స్టాల్స్ ఏర్పాటు చేయబోతున్నామన్నారు. ప్రధాని మోదీ పిలుపు మేరకు అలయ్ బలయ్ వంటకాల్లో మిల్లెట్స్ ను కూడా చేర్చినట్లు తెలిపారు. ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు, కేంద్రమంత్రులను రాజకీయాలకు అతీతంగా అందరినీ ఆహ్వానించినట్లు తెలిపారు.