ఇటీవల రైలు ప్రమాదాలకు భారీగా కుట్రలు చేస్తున్నారు. కావాలని చేస్తున్నారో..ఆకతాయితనం తో చేస్తున్నారో కానీ దీనివల్ల రైలు ప్రయాణికులు భయపడుతూ ప్రయాణం చేస్తున్నారు. రైలు ట్రాక్ లపై గ్యాస్ సిలిండర్ లు పెట్టడం , ఇనుప రాడ్లు పెట్టడం , భారీ సిమెంట్ స్థంబాలు పెట్టడం చేసి భయబ్రాంతులకు గురి చేస్తున్నారు. ప్రతి రోజు ఈ తరహా ఘటనలు జరుగుతూ వస్తున్నాయి.
తాజాగా యూపీ రాయ్బిరేలీలోని లక్ష్మణ్పూర్లో రైల్వే ట్రాక్ మీద సిమెంట్ దిమ్మెను ఉంచడంతో గూడ్స్ రైలు ఢీకొట్టింది. అయితే, అదృష్టవశాత్తూ పెద్ద ప్రమాదం జరగకపోవడంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు. పొలంలో ఉంచిన దిమ్మెను దుండగులు ట్రాక్పైకి లాగినట్లు పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. దీనిపై దర్యాప్తు కొనసాగుతోంది.