హర్యానాలో పుంజుకున్న బీజేపీ.. జమ్మూకశ్మీర్ లో దూసుకుపోతున్న కాంగ్రెస్-నేషనల్ కాన్ఫరెన్స్ కూటమి

BJP resurgent in Haryana...Congress-National Conference alliance advancing in Jammu and Kashmir

న్యూఢిల్లీ : హర్యానా, జమ్మూకశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ కొనసాగుతోంది. హర్యానాలో తొలి రౌండ్లలో పూర్తి లీడ్ లో ఉన్న కాంగ్రెస్ ఆ తర్వాత వెనకబడిపోయింది. బీజేపీ లీడ్ లోకి వచ్చింది. హర్యానాలో మొత్తం 90 నియోజకవర్గాలు ఉండగా… అధికారానికి 46 సీట్లు అవసరం. ప్రస్తుతం బీజేపీ 46 సీట్లలో, కాంగ్రెస్ 40 సీట్లలో ఆధిక్యంలో ఉన్నాయి. ఆప్ అన్ని స్థానాల్లో వెనుకబడి ఉంది.

మరోవైపు, జమ్మూకశ్మీర్ విషయానికి వస్తే… కాంగ్రెస్, నేషనల్ కాన్ఫరెన్స్ కూటమి భారీ ఆధిక్యతతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసే పరిస్థితి ఉంది. మొత్తం 90 స్థానాలున్న జమ్మూకశ్మీర్ లో 53 స్థానాల్లో కాంగ్రెస్ కూటమి ఆధిక్యతలో ఉంది. బీజేపీ కేవలం 23 స్థానాల్లో ముందంజలో ఉంది. పీడీపీ 2 స్థానాల్లో ఆధిక్యతలో కొనసాగుతోంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *