కొనసాగుతున్న హర్యానా, జమ్మూ కశ్మీర్ ఎన్నికల కౌంటింగ్

Ongoing Haryana and Jammu Kashmir Election Counting

న్యూఢిల్లీ : యావత్ దేశం ఉత్కంఠభరితంగా ఎదురుచూస్తున్న హర్యానా, జమ్మూ కశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ మొదలైంది. అత్యంత కట్టుదిట్టమైన భద్రత మధ్య కౌంటింగ్ జరుగుతోంది. కౌంటింగ్ ఆరంభ ట్రెండ్స్ విషయానికి వస్తే.. హర్యానాలో కాంగ్రెస్‌ పార్టీ అత్యధిక స్థానాల్లో లీడ్‌లో దూసుకుపోతున్నట్టు కనిపిస్తోంది. హర్యానాలో మొత్తం 90 అసెంబ్లీ స్థానాలు ఉండగా కాంగ్రెస్ పార్టీ 50కిపైగా స్థానాల్లో ముందంజలో కొనసాగుతోంది. ఇక బీజేపీ 30 కంటే తక్కువ చోట్ల, ఇతరులు పలు చోట్ల ఆధిక్యంలో కొనసాగుతున్నారు.

ఇక దాదాపు పదేళ్ల తర్వాత ఎన్నికలు జరుపుకున్న కేంద్రపాలిత ప్రాంతం జమ్మూ కశ్మీర్‌లో బీజేపీ, కాంగ్రెస్-నేషనల్ కాన్ఫరెన్స్ కూటమి మధ్య హోరాహోరీ పోరు ఖాయమని ఆరంభ ట్రెండ్స్‌ని బట్టి అర్థమవుతోంది. జమ్మూ కశ్మీర్‌లో కూడా కాంగ్రెస్ కూటమి 34కు పైగా స్థానాల్లో, బీజేపీ 30 స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతున్నాయి.

కాగా హర్యానాలో కాంగ్రెస్ పార్టీ శ్రేణులు కౌంటింగ్‌కు ముందే సంబరాలను మొదలుపెట్టాయి. ఎగ్జిట్ పోల్స్ అన్నీ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా రావడంతో కౌంటింగ్ మొదలు కాకముందే హస్తం పార్టీ నాయకులు వేడుకలు మొదలుపెట్టారు. కాగా హర్యానా, జమ్మూ కశ్మీర్ రెండు రాష్ట్రాల అసెంబ్లీల్లోనూ 90 సీట్లు ఉన్నాయి. మేజిక్ ఫిగర్ 46 సీట్లుగా ఉంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

This will close in 10060 seconds