కమర్షియల్‌ గ్యాస్‌ సిలిండర్‌ ధర పెంపు

commercial gas cylinder price hike
commercial gas cylinder price hike
commercial gas cylinder price hike

న్యూఢిల్లీ: వాణిజ్య అవసరాలకు వినియోగించే ఎల్పీజీ సిలిండర్‌ ధరను దేశీయ చమురు సంస్థలు పెంచాయి. 19 కేజీల సిలిండర్‌పై ఏకంగా రూ.48.50 మేర పెరిగింది. ఈ మేరకు ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు మంగళవారం ఉదయం ప్రకటించాయి. పెరిగిన ధరలు నేటి నుంచి అంటే అక్టోబర్‌ 1 నుంచే అమల్లోకి రానున్నట్లు వెల్లడించాయి.

ధరల పెంపు తర్వాత దేశ రాజధాని ఢిల్లీలో కమర్షియల్‌ గ్యాస్‌ సిలిండర్‌ ధర రూ.1,691 నుంచి రూ.1740కి పెరిగింది. కోల్‌కతాలో రూ.1,802 నుంచి రూ.1,850.50కి, ముంబైలో రూ.1,644 నుంచి రూ.1,692.50కి, చెన్నైలో రూ.1,855 నుంచి రూ.1,903కి పెరిగాయి. స్థానిక పన్నుల ఆధారంగా రాష్ట్రాలను బట్టి ధరల్లో మార్పులు ఉంటాయి. కాగా అంతకుముందు సెప్టెంబర్ 1, ఆగస్టు 1న కూడా కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధరలను కంపెనీలు పెంచాయి.

ఇక 14.2 కేజీల గృహ వినియోగ సిలిండర్ ధరలో ఎలాంటి మార్పు లేదని, పాత ధరలే యథాతథంగా కొనసాగుతాయని చమురు కంపెనీలు స్పష్టం చేశాయి. ప్రతి నెల 1వ తేదీన ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు ధరలను సవరిస్తుంటాయి. అందులో భాగంగా ఇవాళ కూడా సవరించిన ధరలను ప్రకటించాయి.

This will close in 10060 seconds