హైదరాబాద్ ఇప్పుడు గ్లోబల్ డేటా సెంటర్ల హబ్‌గా మారుతోంది. హైటెక్ సిటీలో ఇప్పటికే డేటా సెంటర్ నిర్వహిస్తున్న ST Telemedia Global Data Center (STT GDC) సంస్థ, హైదరాబాద్‌లో కొత్త డేటా సెంటర్ ఏర్పాటుకు భారీ పెట్టుబడులు పెట్టనుంది. సింగపూర్ పర్యటనలో భాగంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమక్షంలో STT GDC సంస్థతో రూ.3,500 కోట్ల విలువైన అవగాహన ఒప్పందం (MoU) కుదిరింది.మీర్ఖాన్‌పేట, ముచ్చర్ల సమీపంలో 100 మెగావాట్ల సామర్థ్యంతో ఆధునిక ఏఐ ఆధారిత డేటా సెంటర్‌ను ఏర్పాటు చేయనున్నారు. భవిష్యత్తు అవసరాలను దృష్టిలో పెట్టుకుని విస్తరణ సౌకర్యాలను కల్పించనున్నారు.

ఇది దేశంలోనే అతిపెద్ద డేటా సెంటర్లలో ఒకటిగా మారనుంది.ఈ ఒప్పందంపై పరిశ్రమల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జయేష్ రంజన్, STT గ్రూప్ సీఈఓ బ్రూనో లోపెజ్‌లు సంతకాలు చేశారు. ఈ సందర్భంగా బ్రూనో లోపెజ్ మాట్లాడుతూ, “తెలంగాణ ప్రగతిశీల విధానాలు, ప్రభుత్వం అందించే మద్దతు, ఆధునిక మౌలిక సదుపాయాలు డేటా సెంటర్ అభివృద్ధికి అనుకూలంగా ఉన్నాయి” అని తెలిపారు.
ఈ ప్రాజెక్టు రాష్ట్ర ఆర్థికాభివృద్ధి, ఉపాధి అవకాశాల పెంపు, స్థిరమైన డిజిటల్ భవిష్యత్తుకి తోడ్పడుతుందన్నారు.ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ, “హైదరాబాద్‌ను ప్రపంచ డేటా సెంటర్ల రాజధానిగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తున్నాం” అని చెప్పారు. STT GDC సంస్థ పెట్టుబడులకు కృతజ్ఞతలు తెలిపారు. ఐటీ శాఖ మంత్రి శ్రీధర్ బాబు మాట్లాడుతూ, “AI ఆధారిత రంగంలో హైదరాబాద్ గ్లోబల్ లీడర్‌గా ఎదగగలదు” అని ధీమా వ్యక్తం చేశారు.STT GDC సంస్థ దశాబ్దంలో 1 గిగావాట్ సామర్థ్యంతో తమ కార్యకలాపాలను విస్తరించాలనే లక్ష్యాన్ని పెట్టుకుంది. ఇందుకోసం రూ.26,000 కోట్ల పెట్టుబడులు పెట్టనున్నట్లు అంచనా. ఈ భారీ ప్రాజెక్టు తెలంగాణ మౌలిక సదుపాయాలను మరింత అభివృద్ధి చేసి, హైదరాబాద్‌ను గ్లోబల్ డేటా హబ్‌గా నిలబెడుతుంది.