ఈ వారంలో మరో 3 శ్వేతపత్రాలు: సీఎం చంద్రబాబు

chandrababu

ఏపీలో అధికారం చేపట్టిన కూటమి సర్కార్..వరుసగా శ్వేతపత్రాలు విడుదల చేసి గడిచిన ఐదేళ్లలో జగన్ చేసిన నిర్వాహకాన్ని బయటపెడుతోంది. ఇప్పటికే అమరావతి , పోలవరం , విద్యుత్తూ , అడవులు ఇలా పలు వాటిపై శ్వేతపత్రాలు విడుదల చేసి వాటిలో జరిగిన లోపాలు ప్రజలకు తెలియజేసారు.

ఎల్లుండి నుంచి వరుసగా 3 రోజులు మూడు శ్వేతపత్రాలు విడుదల చేయనున్నట్లు సీఎం చంద్రబాబు తెలిపారు. గురువారం శాంతిభద్రతలు, మహిళల రక్షణపై, శుక్రవారం మరో అంశంపై, శనివారం రాష్ట్ర ఆర్థిక పరిస్థితిపై శ్వేతపత్రాలు విడుదల చేయనున్నారు. వీటిపై అసెంబ్లీ సమావేశాల్లోనూ చర్చించనున్నారు. నిన్న ‘వైసీపీ పాలనలో సహజవనరుల దోపిడీపై’ శ్వేతపత్రం రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే.

ఇక ఈరోజు సీఎం చంద్రబాబు అన్ని జిల్లాల కలెక్టర్లు, ఎస్పీలు, సీపీలతో సమావేశం కానున్నారు. ఈ సమావేశం లో 9 ఎజెండాలు ఉంటాయి. ప్రజా పాలన , ధరణి, వ్యవసాయం , వాతావరణ పరిస్థితులు, ఆరోగ్యం, సీజనల్ వ్యాధులు, వన మహోత్సవం, మహిళ శక్తి, విద్య, శాంతి భద్రతలు, డ్రగ్స్ వంటి అంశాలపై సమావేశం జరగనుంది.