రెస్క్యూ కోసం వెళ్తూ కూలిన హెలికాప్టర్.. ముగ్గురు సిబ్బంది గల్లంతు

3 Indian Coast Guard personnel missing after helicopter makes hard landing during rescue mission
3 Indian Coast Guard personnel missing after helicopter makes hard landing during rescue mission

అహ్మాదాబాద్‌: గుజరాత్‌లోని పోరుబందర్ తీరం వద్ద విషాదం చోటుచేసుకున్నది. అరేబియా సముద్రంలో భారతీయ నౌకాదళానికి చెందిన అడ్వాన్స్‌డ్ లైట్ హెలికాప్టర్ కూలింది. రెస్క్యూ కోసం వెళ్లిన ఆ హెలికాప్టర్ కూలిన ఘటనలో ముగ్గురు సిబ్బంది గల్లంతు అయ్యారు. ఒకరి మృతదేహాన్ని గుర్తించారు. మోటార్ ట్యాంకర్ హరి లీలా నౌక వద్దకు రెస్క్యూ చేసేందుకు ఆ హెలికాప్టర్ వెళ్లింది. అయితే ఆ సమయంలో హార్డ్ ల్యాండింగ్ జరిగినట్లు అనుమానిస్తున్నారు.

దీంతో ఐసీజీ సిబ్బంది రంగంలోకి దిగింది. నాలుగు నౌకలు, రెండు విమానాల ద్వారా సెర్చ్ ఆపరేషన్ చేపడుతున్నారు. సోమవారం రాత్రి 11 గంటలకు ఏఎల్‌హెచ్ రెస్క్యూ ఆపరేషన్‌కు వెళ్లింది. కొన్ని రోజుల క్రితమే ఆ హెలికాప్టర్ గుజరాత్‌లో వదరల్లో చిక్కుకున్న 67 మందిని రక్షించింది.

కాగా, నలుగురు సిబ్బంది, ఇద్దరు పైలట్లతో వెళ్తున్న హెలికాప్టర్ గుజరాత్‌లోని పోర్‌బందర్ తీరంలో గత రాత్రి అత్యవసరంగా ల్యాండ్ అయింది. హెలికాప్టర్.. నౌకను సమీపిస్తుండగా ఈ ఘటన జరిగినట్టు కోస్ట్‌గార్డు అధికారులు తెలిపారు. గల్లంతైన ఇద్దరు డైవర్లలో ఒకరిని రక్షించామని, మరో డైవర్, ఇద్దరు పైలట్ల కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయని అధికారులు తెలిపారు. నాలుగు నౌకలు, రెండు విమానాలతో గాలింపు చేపడుతున్నట్టు ఇండియన్ కోస్ట్‌ గార్డ్ తెలిపింది.