27 Naxalites killed in enco

ఛత్తీస్గఢ్ ఎన్ కౌంటర్ – 27కు చేరిన మృతుల సంఖ్య

ఛత్తీస్గఢ్-ఒడిశా సరిహద్దులోని గరియాబంద్, నౌపాడ జిల్లాల్లో భద్రతా బలగాలు నిర్వహించిన భారీ ఎన్‌కౌంటర్‌లో మృతుల సంఖ్య భారీగా పెరుగుతుంది. మొదట 12 మందే అనుకున్నాం కానీ గంటలు గడిచేకొద్దీ మృతుల సంఖ్య పెరుగుతూ వస్తుంది. ప్రస్తుతం అందుతున్న సమాచారం మేరకు ఈ ఎన్ కౌంటర్ లో 27 మంది మావోయిస్టులు మృతి చెందినట్లు తెలుస్తుంది. ఈ సంఘటన మావోయిస్టుల కార్యకలాపాలకు గట్టి ఎదురు దెబ్బగా నిలిచింది. మృతుల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉందని అధికారులు తెలిపారు.

ఈ ఎన్‌కౌంటర్‌లో ఇప్పటివరకు 16 మావోయిస్టుల మృతదేహాలను భద్రతా బలగాలు స్వాధీనం చేసుకున్నాయి. మావోయిస్టుల ఆధిపత్యం ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో భద్రతా బలగాలు ఆపరేషన్లు ముమ్మరం చేసినట్లు సమాచారం. ఈ క్రమంలో కోబ్రా సెక్యూరిటీ ఫోర్సెస్ మావోయిస్టులతో తలపడటం వల్ల తీవ్ర కాల్పులు చోటు చేసుకున్నాయి. భద్రతా బలగాలు మావోయిస్టుల అడ్డాలకు చేరుకోవడంతో పెద్ద ఎత్తున ఆయుధాలు, పేలుడు పదార్థాలు స్వాధీనం చేసుకున్నట్లు అధికారులు వెల్లడించారు. మావోయిస్టుల దాడులు తగ్గించడం కోసం కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా చర్యలు తీసుకుంటున్నట్లు తెలుస్తోంది. మరోవైపు మావోయిస్టులు ప్రతీకార చర్యలకు దిగే అవకాశం ఉందని భద్రతా బలగాలు అప్రమత్తంగా ఉన్నాయి. ఈ సంఘటన తరువాత బోర్డర్ ప్రాంతాల్లో భద్రతా చర్యలను మరింత కట్టుదిట్టం చేశారు. అటవీ ప్రాంతాల్లో మావోయిస్టుల కదలికలను నిరోధించేందుకు ప్రత్యేక బలగాలను నియమించారు.

Related Posts
కేంద్ర బడ్జెట్ నిరాశపరిచింది – భట్టి విక్రమార్క
bhatti budjet

తెలంగాణ రాష్ట్ర డిప్యూటీ ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క కేంద్ర బడ్జెట్‌ను తీవ్రంగా విమర్శించారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ తెలంగాణ రాష్ట్ర అవసరాలను పూర్తిగా నిర్లక్ష్యం చేసిందని Read more

క్యాంపస్ విద్యార్థుల అథ్లెటిక్ ప్రతిభ
Students of KLH Bachupally Campus who achieved excellence in displaying outstanding athletic talent

హైదరాబాద్: అత్యుత్తమ క్రీడా విజయాలు మరియు విద్యావిషయక విజయాలతో కూడిన ఒక సంవత్సరాన్ని కెఎల్‌హెచ్‌ బాచుపల్లి క్యాంపస్ జరుపుకుంది. తామెంచుకున్న రంగాలలో రాణిస్తున్న విద్యార్థి-అథ్లెట్లకు ప్రోత్సాహక మైదానంగా Read more

నేడు ఏపీ కేబినెట్ భేటీ..!
AP Cabinet meeting today..!

అమరావతి: సీఎం చంద్రబాబు అధ్యక్షతన సచివాలయంలో ఈరోజు ఉదయం 11 గంటలకు మంత్రి వర్గ సమావేశం జరుగనుంది. ఈ భేటీలో మంత్రివర్గం పలు కీలక నిర్ణయాలకు ఆమోదం Read more

కాంగ్రెస్‌పై భారీ నిరసనల ప్రణాళికతో బీఆర్‌ఎస్
కాంగ్రెస్‌పై భారీ నిరసనల ప్రణాళికతో బీఆర్‌ఎస్

రైతులకు కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీని నెరవేర్చాలని డిమాండ్ చేస్తూ బీఆర్‌ఎస్ తెలంగాణ వ్యాప్తంగా అన్ని జిల్లా కేంద్రాల్లో వరుస రైతు నిరసనలు చేయాలనీ ప్రణాళిక చేస్తుంది. Read more