తెలంగాణలో కొత్తగా 2,043 కరోనా కేసులు
మొత్తం కేసుల సంఖ్య 1,67,046
హైదరాబాద్: తెలంగాణలో కొత్తగా 2,043 కరోనా కేసులు నమోదయ్యాయని రాష్ట్ర వైద్య, ఆరోగ్యశాఖ వెల్లడించింది. మొత్తం పాజిటివ్ కేసుల సంఖ్య 1,67,046కి చేరింది. కొత్తగా 1802 మంది వైరస్ నుంచి కోలుకోగా, ఇప్పటి వరకు 1,35,357 మంది ఇండ్లకు చేరుకున్నారు. తాజాగా మరో 11 మంది మృతి చెందగా, మొత్తం 1,016 మంది మృత్యువాతపడ్డారు. ప్రస్తుతం రాష్ట్రంలో 30,673 యాక్టివ్ కేసులున్నాయని, మరో 24,081 మంది హోం ఐసోలేషన్లో ఉన్నట్లు వైద్య, ఆరోగ్యశాఖ చెప్పింది. కాగా, రాష్ట్రంలో 0.60శాతం మరణాలు రేటు ఉండగా, రికవరీ రేటు 81.02శాతంగా ఉందని పేర్కొంది.
తాజా జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి:https://www.vaartha.com/news/national/