గుడ్ న్యూస్ ..తగ్గిన ఎల్‌పీజీ గ్యాస్ ధరలు

commercial-lpg-price-cut-down

కేంద్ర బడ్జెట్‌కు ముందు మోడీ ప్రభుత్వం సామాన్య ప్రజలకు గుడ్ న్యూస్ తెలిపింది. జూలై 1, 2024న 19 కేజీల ఎల్‌పీజీ సిలిండర్( LPG cylinders) ధరలు తగ్గాయి. ఈ క్రమంలో ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలు 19 కిలోల కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధరను రూ.30 తగ్గించాయి. IOCL వెబ్‌సైట్ ప్రకారం ఈ మార్చబడిన LPG ధరలు నేటి నుంచి అమల్లోకి వస్తాయి. కానీ 14.2 కిలోల డొమెస్టిక్ సిలిండర్ల ధరల్లో మాత్రం కంపెనీలు ఎలాంటి మార్పు చేయలేదు.

దీంతో ఢిల్లీ లో 19 కిలోల LPG గ్యాస్( LPG gas) ధర రూ.1646గా మారగా, తెలంగాణలోని హైదరాబాద్‌ లో 19 కిలోల LPG గ్యాస్ ధర 72 రూపాయలు తగ్గి రూ. 1903.50కి చేరింది. ఏపీలోని విజయవాడ లో రూ.32 తగ్గి రూ.1832.50కి చేరుకుంది. మరోవైపు ఈ సిలిండర్ కోల్‌కతాలో రూ.1756కి అందుబాటులో ఉండగా, ముంబైలో రూ.1598, చెన్నైలో సిలిండర్ రూ.1809గా ఉన్నాయి.