17 thousand employees fired. Boeing aircraft company

17 వేల మంది ఉద్యోగులపై వేటు: బోయింగ్ విమాన సంస్థ

ముంబయి: విమాన తయారీ దిగ్గజ సంస్థ బోయింగ్ షాకింగ్ నిర్ణయం తీసుకుంది. తమ మొత్తం ఉద్యోగుల్లో దాదాపు 10 శాతం మంది అంటే 17 వేల మంది ఉద్యోగులపై వేటుకు రెడీ అయింది. ఈ మేరకు సంస్థ సీఈవో కెల్లీ ఓర్ట్‌బెర్గ్ ఈమెయిల్ ద్వారా ఉద్యోగులకు తెలియజేశారు. కంపెనీ తీవ్రమైన ఆర్థిక కష్టాలను ఎదుర్కొంటున్న నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిసింది.

సియాటెల్ ప్రాంతంలో ఆ సంస్థకు చెందిన 33 వేల మంది కార్మికులు నెల రోజులుగా సమ్మె చేస్తున్నారు. దీంతో పలు విమానాల ఉత్పత్తి నిలిచిపోయింది. సమ్మె కారణంగా 2025లో డెలివరీ చేయాల్సిన 777 ఎక్స్ విమానాలను ఆ తర్వాతి ఏడాదికి అంటే 2026కు వాయిదా వేసింది. ఇప్పటికే ఉన్న ఆర్డర్లు పూర్తయిన తర్వాత 2027 నుంచి 767 ఫ్రైటర్ విమానాల ఉత్పత్తిని కూడా నిలిపివేయాలని కంపెనీ యోచిస్తోంది.

ఇక ఉద్యోగులను తొలగిస్తున్నట్టు ప్రకటించిన తర్వాత కంపెనీ షేర్లు 1.7 శాతం పతనమయ్యాయి. కార్మికుల సమ్మె కారణంగా మూడో త్రైమాసికంలో సంస్థ 5 బిలియన్ డాలర్ల నష్టాన్ని మూటగట్టుకుంది. ఈ నష్టాలను పూడ్చుకునేందుకు ఇప్పుడు 17 వేల మంది ఉద్యోగులపై వేటుకు సిద్ధమైంది.

Related Posts
70 గంటల వర్క్ వీక్: మరోసారి నారాయణ మూర్తి సంచలన వ్యాఖ్యలు
murthy

ఇన్ఫోసిస్ వ్యవస్థాపకుడు నారాయణ మూర్తి, పలు సార్లు వివాదాలకు గురైన వ్యాఖ్యలు చేయడంతో మరోసారి ఇంటర్నెట్‌లో సంచలనాన్ని సృష్టించారు.. ముంబైలో నవంబర్ 14, 2024 న జరిగిన Read more

దిగ్గజ గాయకుడు జయచంద్రన్ మృతి
jayachandran singer dies

ప్రఖ్యాత గాయకుడు పి జయచంద్రన్ ఈరోజు తుదిశ్వాస విడిచారు. 80 సంవత్సరాల వయసులో ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆయన మరణించారు. ఈ విషయాన్ని ఆయన Read more

DANGER: ఆల్కహాల్ తాగుతున్నారా?
Are you drinking alcohol

మద్యం సేవించే అలవాటు వల్ల 40 ఏళ్ల వ్యక్తి వెంటిలేటర్ పై చావుబతుకుల్లో ఉన్నాడు. మద్యం తాగితే కాలేయం పాడవుతుందని పొరబడుతుంటారు. కానీ, ఆల్కహాల్ అనేది విషంతో Read more

ఢిల్లీ ఎయిమ్స్ లో రోగులను పరామర్శించిన రాహుల్
Rahul Gandhi reached Delhi

కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ అర్ధరాత్రి ఢిల్లీ ఎయిమ్స్ ఆసుపత్రిని పర్యటించారు. ఈ సందర్బంగా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న రోగులతో ఆయన మాట్లాడి వారి సమస్యలు తెలుసుకున్నారు. Read more

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *