Amaravati : ప్రభుత్వ ప్రోత్సాహకాలు, సహకారంతో అమరావతిలో కొత్తగా 17 హోటళ్లు రానున్నాయి. విదేశాలకు వెళ్లిన తెలుగు వారెందరో వెనక్కి వచ్చి అమరావతిలో పెట్టుబడులకు ఆసక్తి చూపుతున్నారు. అమరావతిని ఐటీ, పర్యాటకంగానూ అభివృద్ధి చేయాలి. కొత్త పర్యాటక విధానంలో హోటళ్లకు కరెంటు ఛార్జీల్లో రాయితీ, ఆస్తి పన్ను తగ్గింపు వర్తింపజేయాలి. సమస్యల్లేని చోట్ల రాత్రి 12 గంటల వరకు హోటళ్లు తెరిచే అవకాశమివ్వాలి. హోటళ్లలోని బార్లు అర్ధరాత్రి 2 గంటల వరకు తెరిచేలా అనుమతించాలి అని రాష్ట్ర హోటళ్ల అసోసియేషన్ అధ్యక్షుడు ఆర్వీ స్వామి, ప్రతినిధులు మలినేని రాజయ్య, గోకరాజు గంగరాజు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.

ఈ నిర్ణయంతో రాష్ట్రంలో 54 త్రీ స్టార్, ఆపై హోటళ్లు
త్రీ స్టార్, ఆపై క్లాసిఫైడ్ హోటళ్లలో బార్ లైసెన్సు ఫీజును రూ.25 లక్షలకు తగ్గిస్తూ క్యాబినెట్ తీసుకున్న నిర్ణయంపై ప్రభుత్వానికి రాష్ట్ర హోటళ్ల అసోసియేషన్ కృతజ్ఞతలు తెలిపింది. భారీ ఫీజుల కారణంగా ఇన్నాళ్లూ ఆర్థికంగా నష్టపోతున్న హోటల్ రంగానికి ప్రభుత్వ నిర్ణయం ఊరటనివ్వనుందని విలేకరుల సమావేశంలో అసోసియేషన్ ప్రతినిధులు అభిప్రాయపడ్డారు. బార్ లైసెన్సు ఫీజులు తమిళనాడు, కేరళ, కర్ణాటకలో రూ.10-12 లక్షలు, తెలంగాణలో రూ.40 లక్షల చొప్పున ఉంది. ఇప్పుడు ఏపీలో రూ.25 లక్షలకు తగ్గించినందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్‌కల్యాణ్‌కు కృతజ్ఞతలు. ఈ నిర్ణయంతో రాష్ట్రంలో 54 త్రీ స్టార్, ఆపై హోటళ్లు నష్టాల నుంచి బయటపడతాయ ని ప్రతినిధులు వివరించారు.