10,౦౦౦ మందికి కాగ్నిజెంట్ ఉద్వాసన!

10,౦౦౦ మందికి కాగ్నిజెంట్ ఉద్వాసన!

కరోనా లాక్ డౌన్ సమయంలో ఎంతో మంది ఉద్యోగాలు కోల్పోయారు. ఈ ఉద్యోగాల కొత ఐటి పరిశ్రమను కూడా తాకింది. పరిస్థితులు కోవిడ్ నుండి సాధారణ స్థాయికి వచ్చాక కూడా ఉద్యోగాల కోతలు వెంటాడుతూనే ఉన్నాయని తెలుస్తుంది. అంతేకాదు మరోవైపు గత ఏడాది కాలంలో కాగ్నిజెంట్ టెక్నాలజీస్‌లో 10,000 మందికి పైగా ఉద్యోగులు వారి ఉద్యోగాలకు రాజీనామా చేసినట్లు వెల్లడైంది. ది ఫైనాన్షియల్ ఎక్స్‌ప్రెస్ ప్రచురించిన నివేదిక ప్రకారం, అమెరికాకు చెందిన కాగ్నిజెంట్ టెక్నాలజీ డిసెంబర్‌తో ముగిసిన త్రైమాసికంలో కంపెనీని విడిచిపెట్టిన ఉద్యోగుల సంఖ్య 10,700 అని తెలిపింది. మరోవైపు కాగ్నిజెంట్ ఉద్యోగుల సంఖ్యను పెంచుతున్నట్లు ప్రకటించింది.

10,౦౦౦ మందికి కాగ్నిజెంట్ ఉద్వాసన!

దీనికి సంబంధించి కాగ్నిజెంట్ ఈ సంవత్సరం అంతా కొత్త ఉద్యోగులను నియమించుకుంటుందని ఓ ముఖ్య ఆర్థిక అధికారి తెలిపారు. డిసెంబరుతో ముగిసిన త్రైమాసికంలో కంపెనీలో పనిచేస్తున్న మొత్తం ఉద్యోగుల సంఖ్య 3,36,800. గత 12 నెలల్లో పోల్చి చూస్తే కాగ్నిజెంట్ నుండి రాజీనామా చేసిన వారి సంఖ్య 15.9 శాతం. అంతేకాదు కంపెనీ యుటిలైజేషన్ రేటు 2 శాతం పాయింట్లు తగ్గి 82%కి చేరుకుంది.

కాగ్నిజెంట్ సీఈవో ఏమంటున్నారంటే…

అయితే, 2024 అంతటా యుటిలైజేషన్ మెరుగుదలలు బలంగా ఉన్నాయని యాజమాన్యం హైలైట్ చేసింది.
కాగ్నిజెంట్ సీఈఓ ఏమన్నారంటే కాగ్నిజెంట్ సీఈఓ రవికుమార్ మాట్లాడుతూ, గతంలో కంపెనీని విడిచిపెట్టిన చాలా మంది ఉద్యోగులు తిరిగి కంపెనీకి వస్తున్నారని అన్నారు. గత ఏడాది 2024లోనే కాగ్నిజెంట్‌ను విడిచిపెట్టిన దాదాపు 13,000 మంది ఉద్యోగులు తిరిగి కంపెనీలో చేరారని ఆయన పేర్కొన్నారు. మరో 10,000 మంది కాగ్నిజెంట్‌లో మళ్ళీ చేరడానికి ఆసక్తిగా ఉన్నారని ఆయన చెప్పారు. ప్రతిభావంతులైన ఉద్యోగులను నిలుపుకోవడంలో మా కంపెనీ అద్భుతంగా ఉందనడంలో దీని ద్వారా తేలిందని రవికుమార్ అన్నారు. కాగ్నిజెంట్‌లో పనిచేస్తున్న ఉద్యోగుల సంఖ్య తగ్గిపోతుండగా దీని పోటీదారు యాక్సెంచర్ మాత్రం నిరంతరం కొత్త ఉద్యోగులను నియమించుకుంటోంది.

Related Posts
IPL 2025: నేటి నుంచే ఐపీఎల్ మ్యాచ్
IPL 2025: నేటి నుంచే క్రికెట్ ప్రారంభం!

క్రికెట్ ప్రేమికులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూసిన ఇండియన్ ప్రీమియర్ లీగ్ (IPL) 2025 నేడు అట్టహాసంగా ప్రారంభం కానుంది. 2008లో మొదటి సీజన్‌తో మొదలైన ఈ క్రికెట్ Read more

మోదీతో శ్రీలంక అధ్యక్షుడు దిసనాయకే భేటీ..!
WhatsApp Image 2024 12 16 at 3.57.13 PM

శ్రీలంక అధ్యక్షుడు అనుర కుమార దిసనాయకే మూడురోజుల పర్యటన కోసం భారత్‌కు చేరుకున్నారు. ఈ సందర్భంగా ద్వైపాక్షిక సంబంధాల బలోపేతం, రక్షణ, వాణిజ్యం, పెట్టుబడుల అంశంపై ప్రధాని Read more

విజయవంతంగా చంద్రయాన్-3 ప్రయోగం
విజయవంతంగా చంద్రయాన్-3 ప్రయోగం.

ఇస్రో చేపట్టిన చంద్రయాన్-3 మిషన్‌లో భాగంగా 2023, ఆగస్టు 23న చంద్రుడి దక్షిణ ధ్రువంపై విక్రమ్ ల్యాండర్ విజయవంతంగా ల్యాండ్ అయ్యింది . దీంతో చంద్రుడిపై సాఫ్ట్ Read more

రాహుల్ గాంధీపై కోర్టు రూ.200 జరిమానా
రాహుల్ గాంధీపై కోర్టు రూ.200 జరిమానా

రాహుల్ గాంధీపై కోర్టు రూ.200 జరిమానా కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీకి ఉత్తరప్రదేశ్‌లోని ఒక న్యాయస్థానం రూ.200 జరిమానా విధించింది. ఈ నిర్ణయం రాహుల్ గాంధీ Read more