10 Children Killed As Fire Breaks Out At Hospital In UPs Jhansi

యూపీలోని ఆసుపత్రిలో అగ్నిప్రమాదం.. 10 మంది చిన్నారుల సజీవదహనం

లక్నో: ఉత్తరప్రదేశ్‌లోని ఝాన్సీ జిల్లాలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. మహారాణి లక్ష్మీబాయ్‌ మెడికల్‌ కాలేజీలోని నియోనటల్‌ ఇంటెన్సివ్‌ కేర్‌ యూనిట్‌లో శుక్రవారం అర్ధరాత్రి ఘోర అగ్నిప్రమాదం జరిగింది. ఈ ఘటనలో పది మంది చిన్నారులు సజీవదహనమయ్యారు. మంటలు చెలరేగిన వార్డులో 47 మంది నవజాత శిశువులు ఉన్నారు. ఘటన జరిగిన వెంటనే 31 మంది నవజాత శిశువులను సురక్షితంగా తరలించినట్టు అధికారులు తెలిపారు. ప్రమాదం గురించి సమాచారం అందిన వెంటనే అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకున్నారు.

Advertisements

ఇక 16 మంది చిన్నారులు పరిస్థితి విషమంగా ఉంది. శుక్రవారం రాత్రి 10.45 గంటలకు మంటల చెలరేగడంతో రోగులు, దవాఖాన సిబ్బంది ఒక్కసారిగా భయబ్రాంతులకు గురయ్యారు. ప్రాణాలను రక్షించుకోవడానికి బయటకు పరుగులు పెట్టడంతో తొక్కిసలాట చోటుచేసుకున్నది. ఈ ఘటన జరిగిన సమయంలోఎన్‌ఐసీయూలో మొత్తం 54 మంది చిన్నారులు చికిత్స పొందుతున్నారు.

కాగా, శిశువుల మృతితో ఆస్పత్రి ఆవరణలో హృదయవిదారక వాతావరణం నెలకొంది. తమ బిడ్డలు సురక్షితంగా ఉన్నారా.. లేదా అని తల్లిదండ్రుల రోదనలు మిన్నంటాయి. ప్రమాదానికి షార్ట్‌ సర్క్యూటే కారణమని అధికారులు భావిస్తున్నారు. మిగిలిన రోగులను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.

Related Posts
Gas Cylinder Price: కామార్షల్ గ్యాస్ సిలిండర్ ధర భారీగా తగ్గింపు
Gas Cylinder Price: కామార్షల్ గ్యాస్ సిలిండర్ ధర భారీగా తగ్గింపు

భారీగా తగ్గిన ధరలు! దేశవ్యాప్తంగా కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధర భారీగా తగ్గింది. 19 కేజీల కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధరను ఆయిల్ కంపెనీలు ఏకంగా రూ. Read more

రాష్ట్రపతి కి ఘన స్వాగతం
mangalagiri aims

అమరావతి : మంగళగిరి ఎయిమ్స్‌లో జరిగే మొదటి స్నాతకోత్సవానికి హాజరయ్యేందుకు రాష్ట్రానికి వచ్చిన రాష్ట్రపతి శ్రీమతి ద్రౌపది ముర్ముకు గన్నవరం విమానాశ్రయంలో స్వాగతం పలికిన ముఖ్యమంత్రి నారా Read more

గచ్చిబౌలి ఫ్లైఓవర్ అక్టోబర్ 22 మరియు 28 తేదీల్లో మూసివేత
Fly over bridge In Ado Ekiti 28 scaled

హైదరాబాద్‌లో గచ్చిబౌలి ఫ్లైఓవర్ అక్టోబర్ 22 మరియు 28 తేదీల్లో రాత్రి 11 గంటల నుండి ఉదయం 6 గంటల వరకు మూసివేయబడుతుంది. ఈ సమయంలో రోడ్డు Read more

ముజిగల్ ఎడ్యుటెక్ మైలురాయి వేడుకలు
Muzigal Edutech milestone celebration

హైదరాబాద్ : సంగీత విద్య కోసం భారతదేశం యొక్క ప్రీమియర్ హైబ్రిడ్ ప్లాట్‌ఫారమ్ గా వెలుగొందుతున్న, ముజిగల్ ఎడ్యుటెక్ ప్రైవేట్ లిమిటెడ్, భారతదేశం అంతటా 100+ అకాడమీ Read more

Advertisements
×