సివిల్ సప్లై, వ్యవసాయ, మార్కెటింగ్ శాఖలపై ముఖ్యమంత్రి చంద్రబాబు సమీక్ష

images

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నిత్యావసర వస్తువుల ధరల నియంత్రణకు సంబంధించి అధికారులకు కఠినమైన ఆదేశాలు జారీ చేశారు. ఆయన, సివిల్ సప్లై శాఖ తీసుకుంటున్న చర్యలపై సమీక్ష నిర్వహించారు. ప్రజలపై ధరల భారం పడకుండా ఉండేందుకు మార్కెట్ ఇంటర్వెన్షన్ కీలకమని, ధరల పెరుగుదలను ముందుగానే అంచనా వేసి చర్యలు తీసుకోవాలని సూచించారు.

ఈ సమీక్షలో ముఖ్యమంత్రి, ధరల నియంత్రణకు తక్షణమే కాకుండా దీర్ఘకాలిక పరిష్కారాలను కూడా ఆలోచించాలని ఆదేశించారు. డిమాండ్-సప్లై వ్యత్యాసం వల్ల ఏర్పడే ధరల పెరుగుదలపై గమనించి, అంతకుముందే అవసరమైన చర్యలు తీసుకోవాలని పిలుపునిచ్చారు. సివిల్ సప్లై, వ్యవసాయ, మార్కెటింగ్ శాఖలు సమన్వయంతో పనిచేస్తే మంచి ఫలితాలు వస్తాయని పేర్కొన్నారు.

ఇప్పటికే తీసుకున్న చర్యలను అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. రైతు బజార్లలో పామాయిల్, సన్ ఫ్లవర్ ఆయిల్, కందిపప్పు, టమోటా, ఉల్లిపాయల వంటి వస్తువులు మార్కెట్ ధర కంటే రూ. 10-15 తక్కువ ధరలకు అమ్ముతున్నామని వెల్లడించారు.

సీఎం, ధరల నియంత్రణలో బ్లాక్ మార్కెట్ సమస్యను నివారించడం ముఖ్యమని, బ్లాక్ మార్కెటింగ్‌లో పాల్గొనే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అంతేకాకుండా, రాష్ట్రంలో పామాయిల్, కూరగాయలు, పప్పుల వంటి నిత్యావసర వస్తువుల ఉత్పత్తిని పెంచేందుకు వ్యవసాయ శాఖ ప్రత్యేక ప్రణాళిక రూపొందించాలని సూచించారు.

రైతులకు గిడ్డంగులు అందుబాటులో ఉండటం వల్ల భవిష్యత్తులో ధరల పెరుగుదల నియంత్రణలో సహకారం ఉంటుందని అన్నారు. ధరల నియంత్రణకు సంబంధించి తీసుకునే అన్ని చర్యలు ప్రజలకు ఉపశమనం కలిగించాలనే లక్ష్యంతో ఉండాలని, ఆ దిశగా అధికారులు కృషి చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Thеrе wаѕ nо immediate response frоm iѕrаеl, whісh hаѕ соnѕіѕtеntlу ассuѕеd thе un of іnѕtіtutіоnаl bіаѕ against іt. Life und business coaching in wien – tobias judmaier, msc. Stuart broad truly stands as a force to be reckoned with in the world of test cricket.