vanjangi

వంజంగి మేఘాల కొండ,కొత్తపల్లి జలపాతం వద్ద కిక్కిరిసిన పర్యాటకులు

అల్లూరి జిల్లా లో పర్యాటక ప్రదేశాలన్నీ పర్యాటకులతో ఆదివారం కిటకిటలాడాయి.ప్రముఖ పర్యాటక కేంద్రంగా ప్రసిద్ధి చెందిన వంజoగి మేఘాల కొండను తిలకించేందుకు పర్యాటకులు తెల్లవారు జాము నుంచే వంజoగి మేఘాల కొండకు చేరుకుని మంచు మేఘాలు..చీల్చుకుంటూ ఉదయించే సూర్య కిరణాలు దృశ్యాలను తిలకించిన పర్యాటకులు ఎంతో తన్మయం చెందుతూ వింత అనుభూతిని పొందారు.సూర్యుడు ఉదయించే సమయంలో సూర్య కిరణాలు మంచు మేఘాల నుంచి ప్రకృతి ప్రసాదించే అందమైన దృశ్యాలు పర్యాటకులను కట్టిపడేస్తున్నాయి.పర్యాటకులు మంచు మేఘాలను, దీవుళ్లా తపించేలా కొండలు దర్సనం ఇవ్వడంతో పర్యాటకులు అందమైన దృశ్యాలను సెల్ ఫోన్లలో సెల్ఫీలు తీసుకుంటూ ఎంజాయ్ చేస్తున్నారు.

వంజంగి మేఘాల కొండకు ఆదివారం కావడంతో వెలాదిగా పర్యాటకులు రావడంతో వంజoగి మేఘాల కొండ ప్రదేశం అంతా కిక్కిరిసి పోయింది.ఆ రహదారి అంతా పర్యాటకుల వాహనాలతో రద్దీగా మారింది.అలాగే మరో పర్యాటక ప్రదేశం కొత్తపల్లి జలపాతం సందర్శించడానికి వెలాదిగా పర్యాటకులు వచ్చారు.దీంతో జలపాతం అంతా పర్యాటకులతో కిక్కిరిసి పోయింది.జలపాత అందాలను తిలకిస్తూ జలపాతం వద్ద ఉన్న కొలనులో పర్యాటకులు స్నానాలు చేస్తూ ఎంజాయ్ చేసారు.ఎక్కడా ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా నిర్వాహకులు జాగ్రత్తలు తీసుకున్నారు.అల్లూరి జిల్లా లో ఉన్న అరకు అందాలు,జలపాతాలు,ప్రకృతి ప్రసాదించే అందాలను తిలకించడానికి వచ్చిన పర్యాటకులతో పర్యాటక ప్రదేశాలన్నీ కిక్కిరిసి పోయాయి.

Related Posts
Diwali : దీపావళి రోజు మాత్రమే తెరుచుకునే ఆలయం ఎక్కడ ఉందో తెలుసా..?
hasanamba temple

దీపావళి (Diwali) రోజు మాత్రమే తెరుచుకునే ఆలయం (Temple) ఒకటి ఉందని మీకు తెలుసా..? అంతే కాదు ఆ ఆలయ తలుపులు ఏడాదికోసారి దీపావళికి.. ముందు మాత్రమే Read more

నేడు మహారాష్ట్ర ఎన్నికల ప్రచారానికి వెళ్లనున్న పవన్ కళ్యాణ్
Pawan Kalyan is going to campaign for Maharashtra elections today

అమరావతి: మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ నేడు(శనివారం) మహారాష్ట్ర ఎన్నికల ప్రచారంలో పాల్గొననున్నారు. ఈ మేరకు కూటమి Read more

పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి జైపాల్ రెడ్డి పేరు
Palamuru Rangareddy Lift Ir

తెలంగాణ రాష్ట్ర కేబినెట్ కీలక నిర్ణయాలు తీసుకుంది. పాలమూరు-రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి మాజీ కేంద్ర మంత్రి జైపాల్ రెడ్డి పేరు పెట్టాలని కేబినెట్ నిర్ణయం తీసుకుంది. తెలంగాణ Read more

మహాకుంభమేళా : రోజూ లక్ష మంది ఆకలి తీరుస్తున్న ఇస్కాన్
ISKCON, Adani Group provide

ప్రయాగ్‌రాజ్‌లో జరుగుతున్న మహాకుంభమేళాలో భక్తులు, వర్కర్ల ఆకలి తీర్చేందుకు ఇస్కాన్ సంస్థ అదానీ గ్రూప్‌తో చేతులు కలిపింది. రోజువారీ లక్ష మందికి పైగా భక్తులకు ఆహారాన్ని అందించడం Read more

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *