Minister Atchannaidu introduced the agriculture budget with Rs.43402 crores

రూ.43,402 కోట్లతో వ్యవసాయ బడ్జెట్ ప్రవేశపెట్టిన మంత్రి అచ్చెన్నాయుడు

అమరావతి: ఏపీ అసెంబ్లీలో సోమవారం వ్యవసాయ మంత్రి అచ్చెన్నాయుడు రూ.43,402 కోట్లతో వ్యవసాయ బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్రానికి వ్యవసాయం వెన్నెముక వంటిదని అన్నారు. 62 శాతం జనాభా వ్యవసాయ అనుబంధ రంగాలపై ఆధారపడిందని చెప్పారు. గత ప్రభుత్వం వ్యవసాయాన్ని గాలికొదిలేసిందని విమర్శించారు. భూసార పరీక్షలకు తిరిగి ప్రాధాన్యమిస్తున్నామని.. ఇందు కోసం రిమోట్ సెన్సింగ్ టెక్నాలజీని ఉపయోగిస్తామని చెప్పారు. రైతులకు విత్తనాలు, సూక్ష్మ ఎరువులు రాయితీపై అందిస్తున్నామన్నారు. ప్రాథమిక పరపతి సంఘాల ద్వారా ఎరువుల పంపిణీ చేస్తున్నామని చెప్పారు.

వ్యవసాయ బడ్జెట్ పూర్తి వివరాలు..

.రాయితీ విత్తనాలు – రూ.240 కోట్లు
.భూసార పరీక్షలకు – రూ.38.88 కోట్లు
.విత్తనాల పంపిణీ – రూ.240 కోట్లు
.ఎరువుల సరఫరా – రూ.40 కోట్లు
.పొలం పిలుస్తోంది – రూ.11.31 కోట్లు
.ప్రకృతి వ్యవసాయం – రూ.422.96 కోట్లు
.డిజిటల్‌ వ్యవసాయం – రూ.44.77 కోట్లు
.వ్యవసాయ యాంత్రీకరణ – రూ.187.68 కోట్లు
.అన్నదాత సుఖీభవ – రూ.4,500 కోట్లు
.రైతు సేవా కేంద్రాలకు – రూ.26.92 కోట్లు
.వడ్డీ లేని రుణాలకు – రూ.628 కోట్లు
.ఇంటిగ్రేటెడ్‌ అగ్రి ల్యాబ్స్‌ – రూ.44.03 కోట్లు
.వ్యవసాయ శాఖ – రూ.8,564.37 కోట్లు
.ఉద్యాన శాఖ – రూ. 3469.47 కోట్లు
.పట్టు పరిశ్రమ – రూ.108.4429 కోట్లు
.పంటల బీమా – రూ.1,023 కోట్లు
.వ్యవసాయ మార్కెటింగ్ – రూ.314.80 కోట్లు
.సహకార శాఖ – రూ.308.26కోట్లు
.ఎన్జీ రంగా విశ్వవిద్యాలయం – రూ.507.038 కోట్లు
.ఉద్యాన విశ్వవిద్యాలయం – రూ.102.227 కోట్లు
.ఉచిత వ్యవసాయ విద్యుత్ – రూ.7241.30 కోట్లు
ఉపాధి హామీ అనుసంధానం – రూ.5,150కోట్లు
.ఎన్టీఆర్ జలసిరి – రూ.50 కోట్లు
.నీటిపారుదల ప్రాజెక్టుల నిర్వహణ – రూ.14,637.03 కోట్లు
.శ్రీ వెంకటేశ్వర పశు విశ్వవిద్యాలయం – రూ.171.72 కోట్లు
.మత్స్య విశ్వవిద్యాలయం – రూ.38 కోట్లు
.పశుసంవర్ధక శాఖ – రూ.1,095.71 కోట్లు
.మత్స్య రంగం అభివృద్ధి – రూ.521.34 కోట్లు కేటాయించారు.
.రూ.2,94,427.25 కోట్లతో బడ్జెట్

కాగా, 2024 – 25 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఏపీ ప్రభుత్వం రూ.2,94,427.25 కోట్లతో బడ్జెట్‌ను అసెంబ్లీలో ప్రవేశపెట్టింది. ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్‌ తన తొలి బడ్జెట్‌ను ప్రజల ముందుకు తీసుకొచ్చారు. ఇందులో రెవెన్యూ వ్యయం అంచనా రూ.2,35,916.99 కోట్లు కాగా.. మూలధన వ్యయం అంచనా రూ.32,712.84 కోట్లు. రెవెన్యూ లోటు రూ.34,743.38 కోట్లుగా అంచనా వేశారు. ద్రవ్య లోటు రూ.68,742.65 కోట్లు ప్రతిపాదించారు. రాష్ట్ర స్థూల దేశీయ ఉత్పత్తి (జి.ఎస్.డి.పి.)లో రెవెన్యూ లోటు 4.19 శాతంగానూ ద్రవ్యలోటు 2.12 శాతంగానూ ఉండవచ్చని అంచనా కట్టారు. యువజన, పర్యాటక, సాంస్కృతిక శాఖ- రూ. 322 కోట్ల, పోలీసు శాఖ- రూ. 8,495 కోట్లు, పర్యావరణ, అటవీ, శాస్త్ర, సాంకేతిక శాఖ – రూ. 687 కోట్లు, రవాణా, రోడ్లు, భవనాల శాఖ- రూ. 9,554 కోట్లు, ఇంధన శాఖ – రూ. 8,207 కోట్లు, పరిశ్రమలు, వాణిజ్య శాఖ- రూ. 3,127 కోట్లు కేటాయించారు. ఇంకా వివిధ రంగాలకు ప్రాధాన్యత ఇస్తూ కేటాయింపులు చేశారు.

Related Posts
రేపటి నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు
budget 2025

పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు రేపు (శుక్రవారం) ప్రారంభం కానున్నాయి. 1వ తేదీన కేంద్ర ఆర్దిక మంత్రి నిర్మలా సీతారామన్ 2025-26 వార్షిక బడ్జెట్ ను ప్రతిపాదించనున్నారు. సమావేశాల Read more

గ్లోబల్ ఆర్థిక సంక్షోభంలో రూపీ ₹84.40 వద్ద చరిత్రాత్మక కనిష్ట స్థాయికి చేరింది
rupee

ఇటీవల భారత్‌లో రూపాయి విలువ అమెరికన్ డాలర్‌తో పోలిస్తే గణనీయంగా పడిపోయింది. రూపాయి 84.40 అనే ఆల్-టైమ్ లోవ్ స్థాయికి చేరుకోవడం షాక్ ఇచ్చింది. ఫారెక్స్ వ్యాపారులు Read more

లోకేశ్‌కు డిప్యూటీ సీఎం హోదా..అధిష్టానం కీలక ఆదేశాలు
tdp high respond on nara lokesh deputy cm demands

అమరావతి: ఏపీ మంత్రి నారా లోకేశ్‌ను డిప్యూటీ సీఎం చేయాలన్న డిమాండ్ ఆ పార్టీ సీనియర్ నేతల నుంచి బలంగా వినిపిస్తోన్న వేళ సోమవారం టీడీపీ అధిష్టానం Read more

హెచ్ఎంపీవీ వైరస్‌పై ఆందోళన వద్దు: కేంద్ర ఆరోగ్యశాఖ
హెచ్ఎంపీవీ వైరస్‌పై ఆందోళన వద్దు: కేంద్ర ఆరోగ్యశాఖ

భారతదేశంలో మూడు హెచ్ఎంపీవీ కేసులు ధృవీకరించబడిన తర్వాత ఈ వైరస్ వ్యాప్తి గురించి పెరుగుతున్న ఆందోళనలపై కేంద్ర ఆరోగ్య మంత్రి జేపీ నడ్డా స్పందించారు. సోమవారం ఆయన Read more

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *