Vemireddy couple meet CM Chandrababu

ముఖ్యమంత్రి చంద్రబాబుతో వేమిరెడ్డి దంపతులు భేటి

అమరావతి: సీఎం చంద్రబాబును నెల్లూరు ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, కోవూరు ఎమ్మెల్యే వేమిరెడ్డి ప్రశాంతిరెడ్డి కలిశారు. ఈ మేరకు ఉండవల్లిలోని చంద్రబాబు నివాసానికి వచ్చిన వేమిరెడ్డి దంపతులు సీఎంకు పుష్పగుచ్ఛం అందించారు. ఇటీవల వేమిరెడ్డి ప్రశాంతిని ఏపీ ప్రభుత్వం తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు సభ్యురాలిగా నియమించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో, వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి నేడు చంద్రబాబును కలిసి కృతజ్ఞతలు తెలియజేశారు. దీనికి సంబంధించిన ఫొటోలను ప్రశాంతి రెడ్డి సోషల్ మీడియాలో పంచుకున్నారు.

మరోవైపు నిన్న నెల్లూరు జిల్లా అభివృద్ధి మండలి సమావేశంలో ఆసక్తికర పరిణామం జరగడం తెలిసిందే. మంత్రులు ఆనం రామనారాయణరెడ్డి, నారాయణ హాజరైన ఈ కార్యక్రమానికి ఎంపీ హోదాలో వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి కూడా వచ్చారు. అయితే, వేదికపై ఉన్న ఆయనకు అధికారులు బొకే ఇవ్వడం మర్చిపోయారు. దాంతో ఆయన అలిగి అక్కడ్నించి వెళ్లిపోయారు. ఎమ్మెల్యే ప్రశాంతి రెడ్డి కూడా భర్త వెంటే అక్కడ్నించి వెళ్లిపోయారు.

Related Posts
కొనసాగుతున్న హర్యానా, జమ్మూ కశ్మీర్ ఎన్నికల కౌంటింగ్
Ongoing Haryana and Jammu Kashmir Election Counting

న్యూఢిల్లీ : యావత్ దేశం ఉత్కంఠభరితంగా ఎదురుచూస్తున్న హర్యానా, జమ్మూ కశ్మీర్ అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ మొదలైంది. అత్యంత కట్టుదిట్టమైన భద్రత మధ్య కౌంటింగ్ జరుగుతోంది. Read more

నేడు మహారాష్ట్ర ఎన్నికల ప్రచారానికి వెళ్లనున్న పవన్ కళ్యాణ్
Pawan Kalyan is going to campaign for Maharashtra elections today

అమరావతి: మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఏపీ డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ నేడు(శనివారం) మహారాష్ట్ర ఎన్నికల ప్రచారంలో పాల్గొననున్నారు. ఈ మేరకు కూటమి Read more

టీడీపీ నేతపై మాధవీలత ఫిర్యాదు
టీడీపీ నేతపై మాధవీలత ఫిర్యాదు

బీజేపీ నాయకురాలు, నటి మాధవి లత, టీడీపీ నేత మరియు తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డిపై సైబరాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. మాధవి లత Read more

దిగ్గజ గాయకుడు జయచంద్రన్ మృతి
jayachandran singer dies

ప్రఖ్యాత గాయకుడు పి జయచంద్రన్ ఈరోజు తుదిశ్వాస విడిచారు. 80 సంవత్సరాల వయసులో ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ ఆయన మరణించారు. ఈ విషయాన్ని ఆయన Read more

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *