mudragada

మళ్లీ వార్తల్లోకి వచ్చిన ముద్రగడ

కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం మరోసారి వార్తల్లో నిలిచాడు. అప్పట్లో ఎన్నికల సమయంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ను టార్గెట్ చేస్తూ వార్తల్లో నిలిచినా ఈయన..ఫలితాల దెబ్బకు అడ్రెస్ లేకుండా పోయాడు. మళ్లీ ఇన్ని నెలలకు మరోసారి లేఖలు రాస్తూ వార్తల్లో నిలుస్తున్నాడు. ఈసారి సీఎం చంద్రబాబును ఉద్దేశిస్తూ లేఖ రాశారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను ప్రస్తావించారు. అలాగే రెడ్‌బుక్‌ను ఉద్దేశిస్తూ లేఖలో పలు ఆరోపణలు చేశారు. సోషల్ మీడియా కేసులను ప్రధానంగా చూపుతూ లేఖలో పేర్కొన్నారు.

ఈరోజు (శుక్రవారం) సీఎం చంద్రబాబును ఉద్దేశిస్తూ ముద్రగడ లేఖను విడుదల చేశారు. సూపర్ సిక్స్ హామీలను అమలు చేయలేకే సోషల్ మీడియా కేసులు, రెడ్ బుక్ వేధింపులు అంటూ లేఖలో ఆరోపణలు గుప్పించారు. సూపర్ సిక్స్ హామీల అమలు, వైజాగ్ స్టీల్ ప్లాంట్, ప్రత్యేక హోదా సాధనపై దృష్టి పెట్టాలని డిమాండ్ చేశారు. అమాయకులను జైల్లో పెట్టి కొట్టించకూడదంటూ ముద్రగడ పద్మనాభం సూక్తులు చెబుతూ లేఖ రాశారు.

Related Posts
ఢిల్లీలో పేలుడు కలకలం
Delhi CRPF School Incident

ఢిల్లీలో భారీ పేలుడు అలజడి సృష్టించింది. రోహిణి ప్రాంతంలోని సీఆర్పీఎఫ్ స్కూల్ గోడ వద్ద భారీ పేలుడు శబ్దం రావడంతో స్థానికంగా భయాందోళన నెలకొంది. పేలుడు ధాటికి Read more

‘కంగువా’ రెండో రోజు కలెక్షన్లు ఎంతంటే..?
kanguva collections

సూర్య కంగువా మూవీ కలెక్షన్స్ రోజు రోజుకు భారీగా పడిపోతున్నాయి. తెలుగులో మన స్టార్ హీరోలతో సమానంగా స్టార్ డమ్ సొంతం చేసుకున్న సూర్య హీరోగా శివ Read more

‘గేమ్‌ ఛేంజర్‌’ లీక్‌పై నిర్మాత ఆవేదన
'Game changer' police instr

రామ్‌ చరణ్‌ (Ram Charan) హీరోగా శంకర్‌ దర్శకత్వంలో దిల్ రాజు (Dil Raju) నిర్మించిన భారీ బడ్జెట్‌ పొలిటికల్‌ డ్రామా 'గేమ్‌ ఛేంజర్‌' (Game Changer Read more

వారికి రైతు భరోసా ఇవ్వం తేల్చేసిన మంత్రి పొంగులేటి
Ponguleti Srinivasa Reddy

రైతు భరోసా పథకం అమలులో ప్రభుత్వం స్పష్టమైన విధానాన్ని పాటిస్తుందని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. రైతులకు ఉపశమనం కలిగించే ఈ పథకం, భూమి యోగ్యత Read more

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *