CM Chandrababu held meeting with TDP Representatives

మరికాసేపట్లో ఢిల్లీకి సీఎం చంద్రబాబు

ఏపీ సీఎం చంద్రబాబు శుక్రవారం మధ్యాహ్నం 1.00 గంటకు ఢిల్లీకి వెళ్లనున్నారు. అందుకోసం వెలగపూడిలోని సచివాలయం ఎదురుగా ఉన్న హెలి ప్యాడ్ నుంచి హెలికాఫ్టర్‌లో గన్నవరం విమానాశ్రయానికి చేరుకొని, అక్కడి నుంచి ప్రత్యేక విమానంలో ఆయన ఢిల్లీకి వెళ్లనున్నారు. ఢిల్లీ పర్యటనలో భాగంగా పలువురు కేంద్ర మంత్రులతో ఆయన భేటీ కానున్నారు. ఈ సందర్బంగా రాష్ట్రాభివృద్ధికి సంబంధించిన పలు కీలక అంశాలపై వారితో ఆయన చర్చించనున్నారు.

ఇదే క్రమంలో ఢిల్లీలోని బీజేపీ పెద్దలతోనూ ఆయన భేటీ అవుతారు. బీజేపీ పెద్దల కోరిక మేరకు శనివారం ఢిల్లీ నుంచి మహారాష్ట్రకు చంద్రబాబు బయలుదేరి వెళ్లనున్నారు. మహారాష్ట్ర అసెంబ్లీకి జరగనున్న ఎన్నికల ప్రచారంలో సీఎం చంద్రబాబు పాల్గొననున్నారు. ఎన్డీఏ అభ్యర్ధుల విజయాన్ని కాంక్షిస్తూ ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు. మహారాష్ట్ర ఎన్నికల ప్రచారానికి ఎన్డీయే తరఫున ముఖ్యమంత్రి చంద్రబాబుతో పాటుగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వెళ్లనున్నారు. బీజేపీ పెద్దల ఆహ్వానం మేరకు ఈ నెల 16, 17 తేదీల్లో ఇద్దరు నేతలు మహారాష్ట్రలో ఎన్నికల ప్రచార సభల్లో పాల్గొంటారు. శనివారం అసెంబ్లీ సమావేశాలకు ఇద్దరు ముఖ్య నేతలు అందుబాటులో ఉండరు. చంద్రబాబు, పవన్ కళ్యాణ్ మహారాష్ట్రలో తెలుగువారు ఎక్కువగానే నివాసం ఉండే ప్రాంతాల్లో ప్రచారం చేయబోతున్నట్లు తెలుస్తోంది.

Related Posts
ఆరోగ్య బీమా పథకం ‘సర్వః ’ను విడుదల చేసిన మణిపాల్‌సిగ్నా
A holistic health insurance scheme with special focus on the under insured segment in India

హైదరాబాద్‌: మణిపాల్‌సిగ్నా సర్వః మూడు ప్రత్యేకంగా తీర్చిదిద్దిన ప్లాన్‌లను : సర్వః ప్రథం , సర్వః ఉత్తమ్ మరియు సర్వః పరమం విడుదల చేసింది. ప్రజల ఆర్థిక Read more

పిఠాపురానికి 100 పడకల ఆసుపత్రి
pitapuram hsp

డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తన నియోజకవర్గం పిఠాపురానికి మెరుగైన వైద్య సేవలను అందించేందుకు మరో కీలక నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటికే ఉన్న 30 పడకల కమ్యూనిటీ Read more

ఇంటికి చేరుకున్న అల్లు అర్జున్..భావోద్వేగానికి గుర‌యిన ఫ్యామిలీ
Allu arjun bail

సంధ్య థియేటర్ ఘటనలో అరెస్టై.. చంచల్‌గూడ జైలులో ఉన్న అల్లు అర్జున్ఈరోజు ఉదయం విడుదల అయ్యారు. జైలు నుండి నేరుగా గీతా ఆర్ట్స్ కార్యాలయానికి వెళ్లారు. అటు Read more

మధ్యతరగతి వారికి ఉద్యోగాలు విడుదల..!
మధ్యతరగతి వారికి ఉద్యోగాలు విడుదల

కేంద్ర బడ్జెట్ 2025ని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ 8వసారి ప్రవేశపెట్టారు. ఈ బడ్జెట్‌లో తెలుగు కవి గురజాడ అప్పారావు ప్రసిద్ధ వచనం "దేశమంటే మట్టికాదోయ్, దేశమంటే Read more

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *