Relief for battalion consta

బెటాలియన్‌ కానిస్టేబుళ్లకు ఊరట..

తెలంగాణ బెటాలియన్‌ పోలీస్‌ కానిస్టేబుళ్ల కుటుంబాల నిరసనలు ఫలవంతమయ్యాయి. ప్రభుత్వం కొత్తగా జారీ చేసిన సెలవుల జీవో పట్ల తీవ్ర వ్యతిరేకత వ్యక్తం చేసిన కుటుంబసభ్యులు, ఈ ఆదేశాలను వెనక్కి తీసుకునేందుకు ఆందోళనలు ప్రారంభించారు. ఇంతకుముందు బెటాలియన్‌ కానిస్టేబుళ్లకు 15 రోజులకు ఒకసారి సెలవుపై ఇంటికి వెళ్లే అవకాశం ఉండేది. కానీ, కొత్త జీవో ప్రకారం 26 రోజులకు ఒకసారి మాత్రమే సెలవు మంజూరు చేయాలనే నిర్ణయాన్ని కాంగ్రెస్‌ ప్రభుత్వం తీసుకుంది.

ఈ జీవోపై బెటాలియన్‌ కానిస్టేబుళ్ల కుటుంబ సభ్యులు నిరసన చేపట్టి, పలు బెటాలియన్ల ముందు ధర్నాలు నిర్వహించారు. శుక్రవారం సాయంత్రం తెలంగాణ స్పెషల్‌ అదనపు డీజీపీ తాజా ఉత్తర్వులను జారీ చేయడంతో ప్రభుత్వం తాత్కాలికంగా జీవోను నిలిపివేసింది. రేవంత్‌ రెడ్డి నేతృత్వంలోని ప్రభుత్వం ఈ నిర్ణయంతో దిగొచ్చి, తాత్కాలికంగా కుటుంబాలకు ఊరట కల్పించడంతో కానిస్టేబుళ్ల కుటుంబాల్లో సంతోషం వ్యక్తమవుతోంది.

Related Posts
కుటుంబ సభ్యులను గుర్తుపట్టని శ్రీ తేజ..!
sri teja health bulletin re

హైదరాబాద్‌లో సంచలనం సృష్టించిన సంధ్య థియేటర్ ఘటనలో తీవ్రంగా గాయపడిన శ్రీ తేజ ఆరోగ్యంపై కిమ్స్ ఆసుపత్రి తాజా హెల్త్ బులిటెన్ విడుదల చేసింది. పుష్ప 2 Read more

తెలంగాణ భవన్ వద్ద హై టెన్షన్.. భారీగా పోలీసుల మోహరింపు
High tension at Telangana Bhavan. Heavy deployment of police

హైదరాబాద్‌: ఫార్ములా-ఈ కారు రే సు కేసుకు సంబంధించి అవినీతి నిరోధక శాఖ (ఏసీబీ) సోమవారం మాజీ మంత్రి కేటీఆర్‌ను విచారించనుంది. ఈ నెల 6న ఉదయం Read more

తెలంగాణలో చలి కనిష్ట ఉష్ణోగ్రతలు
తెలంగాణలో చలి కనిష్ట ఉష్ణోగ్రతలు

తెలంగాణలోని కొన్ని ప్రాంతాలను చలిగాలులు పట్టి పీడిస్తున్నాయి. గురువారం రాజధాని హైదరాబాద్‌తో సహా రాష్ట్రవ్యాప్తంగా చలిగాలుల లాంటి పరిస్థితులు నెలకొనడంతో తెలంగాణలోని కొన్ని ప్రాంతాల్లో కనిష్ట ఉష్ణోగ్రతలు Read more

ట్రంప్ హోటల్ ముందు కారులో పేలుడు
Car explosion in front of Trump hotel

లాస్‌ ఏంజెల్స్‌ : అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన డొనాల్డ్ ట్రంప్‌కి చెందిన అంతర్జాతీయ హోటల్‌ భవనం ఎదుట బుధవారం పేలుడు జరిగింది. టెస్లా కారులో పేలుడు సంభవించింది. Read more

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *