pawan kalyan to participate in palle panduga in kankipadu

ప్రజలకు దీపావళి శుభాకాంక్షలు తెలిపిన పవన్ కల్యాణ్

ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రి, జనసేన అధినేత పవన్ కల్యాణ్ దీపావళి పండుగ సందర్భంగా ప్రజలకు శుభాకాంక్షలు తెలియజేశారు. దీపావళి అర్థవంతమైన పండుగగా ప్రతి ఒక్కరూ జాగ్రత్తలతో జరుపుకోవాలని సూచించారు. దీపం చైతన్యానికి, సజ్జనత్వానికి, సద్గుణ సంపత్తికి ప్రతీకగా ఉంటుందని, దీపావళి దీపాల వెలుగుతో ప్రపంచాన్ని తేజోవంతం చేస్తుందని పవన్ పేర్కొన్నారు.

దీపావళి సంబరాల్లో భాగమైన బాణసంచా నయనానందకరంగా ఉంటుందని, అయితే వీటిని జాగ్రత్తగా వాడాలని సూచించారు. కొద్దిపాటి అజాగ్రత్త కారణంగా దీపావళి సంతోషం విషాదానికి దారితీసే ప్రమాదం ఉందని హెచ్చరించారు.

ప్రతి సంవత్సరం దీపావళి అనంతరం బాణసంచా ప్రమాదాలతో గాయపడే వారిని ఆసుపత్రిలో చూసే సందర్భాలు ఎక్కువగా ఉంటాయని, అందుకే పెద్దలు, పిల్లలు జాగ్రత్తలు పాటించాలని పవన్ కల్యాణ్ కోరారు. ఈ పండుగ అందరికీ ఆనందం, ఆరోగ్యం, సంతోషాలను అందించాలని ఆకాంక్షిస్తూ పవన్ కల్యాణ్ తన శుభాకాంక్షలను తెలిపారు.

Related Posts
ఇంటర్ ప్రాక్టికల్ పరీక్షలకి సీసీటీవీల నిఘా
ఇంటర్ ప్రాక్టికల్ పరీక్షలకి సీసీటీవీల నిఘా

తెలంగాణ బోర్డు ఆఫ్ ఇంటర్మీడియట్ ఎడ్యుకేషన్ (టిజి బిఐఈ) వృత్తి కోర్సులు మరియు సాధారణ కోర్సుల ప్రాక్టికల్ పరీక్షలను ఫిబ్రవరి 3 నుండి 22 మధ్య నిర్వహించేందుకు Read more

4 గ్రహాలను గుర్తించే అరుదైన అవకాశం!
4 గ్రహాలను గుర్తించే అరుదైన అవకాశం!

ప్లానెటరీ సొసైటీ ఆఫ్ ఇండియా (పిఎస్ఐ) వ్యవస్థాపక అధ్యక్షుడు ఎన్. శ్రీ రఘునాథన్ కుమార్ సలహా ఇస్తూ, "6 నుండి 7 గ్రహాల దృశ్యమానత గురించి కొన్ని Read more

ఆప్ పథకాలపై గవర్నర్ దర్యాప్తు
పథకాలు ఆపేందుకు ఆ రెండు పార్టీలు కలిశాయి: కేజ్రీవాల్

ఆప్ పథకాలపై లెఫ్టినెంట్ గవర్నర్ దర్యాప్తుకు ఆదేశం లెఫ్టినెంట్ గవర్నర్ దర్యాప్తునకు ఆదేశించిన తర్వాత ఆప్ ఢిల్లీ సంక్షేమ పథకాలపై దుమారం రేగింది. కాంగ్రెస్ నాయకుడు సందీప్ Read more

జగనన్న కాలనీల్లో భారీ కుంభకోణం : బీజేపీ ఎమ్మెల్యే
A huge scam in Jagananna colonies.. BJP MLA

అమరావతి : బీజేపీ ఎమ్మెల్యే డా.పార్థసారథి జగనన్న కాలనీల భూసేకరణలో భూకుంభకోణంపై విచారణ జరిపించాలని కలెక్టర్ కు వినతపత్రం ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జగనన్న Read more

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *