sweet

పిల్లల హృదయాలను గెలుచుకునే క్యారెట్,బాదం బర్ఫీ

క్యారెట్, బాదం బర్ఫీ చాల సులభంగా తాయారు చేసుకోవచ్చు. దీనిని చిన్న పిల్లలు చాల ఇష్టంగా తింటారు. కారెట్ తినడం వల్ల ఇమ్యూన్ సిస్టమ్ బలంగా ఉంటుంది. ఆరోగ్యానికి సంబంధించిన అనేక సమస్యలను నివారించడంలో సహాయపడుతుంది. తక్కువ క్యాలొరీస్ కలిగిన కారెట్, బరువు నియంత్రణకు అనుకూలంగా ఉంటుంది. బాదం కూడా అనేక ఆరోగ్య ప్రయోజనాలు కలిగివుంది. బాదంలో మగ్నీషియం మరియు కాల్షియం ఉండటం వల్ల ఎముకలు బలంగా ఉండటానికి సహాయపడుతుంది.

క్యారెట్, బాదం బర్ఫీ ని ఎలా చేయాలో ఇప్పుడు తెలుసుకుందాం

కావాల్సిన పదార్ధాలు:
బాదం పప్పు – 1 కప్పు
పంచదార – 2 కప్పులు
వెన్న – అర కప్పు
క్యారెట్ – 2
యాలకుల పొడి – అర టీ స్పూను
తయారు చేయు విధానం

దీన్ని తయారు చేయాలంటే ముందుగా బాదం పప్పును రాత్రి మొత్తం నానబెట్టాలి. తర్వాత దాని పొట్టుతీసేసి విడిగా ఉంచుకోవాలి. మరోపక్క క్యారెట్ ను కట్ చేసుకుని రెడీగా పెట్టుకోవాలి. తర్వాత బాదం, క్యారెట్ ముక్కలను కలిపి, పాలతో మిక్సీకి పట్టి మెత్తగా చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి గిన్నెపెట్టి అందులో బాదం మిశ్రమం , పంచదార, వెన్న వేసి ఉడికించాలి.

ఇలాచి పొడి చల్లి ప్లేట్ కి నెయ్యి రాసి క్యారెట్ బర్ఫీ ని వేసి చల్లారిన తర్వాత ముక్కలుగా కోసుకోవాలి. అంతే రుచికరమైన క్యారెట్ బాదం బర్ఫీ సిద్ధంగా ఉంటుంది.
దీనిని పండగలప్పుడే కాకుండా మామూలు సమయంలో కూడా చేసుకోవచ్చు. పిల్లలు ఎంతో ఇష్టంగా తింటారు.

Related Posts
వీడీయో గేమ్స్ ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం చూపుతుందా?
video games

ఇప్పుడు మనం గేమింగ్ ప్రపంచంలో నివసిస్తున్నాము. యువత ఇష్టపడే వీడీయో గేమ్స్ ఒక ప్రాచుర్యాన్ని పొందాయి. కానీ ఇవి ఆరోగ్యంపై ఏ విధంగా ప్రభావం చూపిస్తాయో తెలుసుకోవడం Read more

క్రిస్మస్ బహుమతులు: సంతోషాన్ని పంచుకునే అవకాశం
christmas gifts

క్రిస్మస్ పండుగ అనేది ప్రేమ, ఐక్యత మరియు ఆనందాన్ని పంచుకునే ఒక ప్రత్యేక సందర్భం. ఈ రోజు ప్రపంచవ్యాప్తంగా ప్రజలు తమ కుటుంబ సభ్యులు, స్నేహితులు, మరియు Read more

ఆయిలీ స్కిన్‌కు సులభమైన చిట్కాలు..
OIL SKIN

మీ చర్మం ఎక్కువ జిడ్డుగా మారితే, అది ఆయిలీ స్కిన్ అంటారు.ఆయిలీ స్కిన్ ఉన్నప్పుడు, మేకప్ లేదా అందం ఉత్పత్తులు ఎంత ఉపయోగకరమైనప్పటికీ, చర్మంపై నూనె పెరిగిపోతుంది. Read more

పాదాల పగుళ్లను తగ్గించడానికి ఈ చిట్కాలు తెలుసుకోండి!
low section person legs with cracked heels floor 1048944 3517578

పాదాలు మన శరీరంలో అత్యంత ముఖ్యమైన భాగం. అవి మన శరీర బరాన్ని మోస్తున్నప్పటికీ, చాలామంది వాటి పట్ల పెద్దగా ఆలోచించరు. కానీ పాదాల పగుళ్ళ సమస్య Read more

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *