రాష్ట్రంలో ఉపాధి హామీ పనుల నాణ్యతలో రాజీపడకూడదని, ప్రతి దశలోనూ నాణ్యతా ప్రమాణాలను కచ్చితంగా పాటించాలంటూ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అధికారులకు ఆదేశించారు. ఉపాధి హామీ, ఆర్థిక సంఘం నిధుల సద్వినియోగం కచ్చితంగా జరిగేలా చూసుకోవాలని, గత వైసీపీ ప్రభుత్వంలో పంచాయతీ నిధులు పక్కదారి పట్టినట్లు ఇప్పుడు అవకాసం ఇవ్వకూడదని ఆయన స్పష్టం చేశారు.
ఈ సందర్భంగా, పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ కమిషనర్ కృష్ణతేజ, ఇతర అధికారులతో కలిసి పవన్ కల్యాణ్ నేడు సమీక్ష నిర్వహించారు. రాష్ట్రంలోని పంచాయతీల అభివృద్ధి పనులు నాణ్యత ప్రమాణాల ప్రకారం జరిగేలా తనిఖీలు నిర్వహించాలని, పర్యవేక్షణ కఠినంగా చేయాలని ఆయన సూచించారు.