నారా లోకేష్ పాదయాత్ర ఆపేయాలంటూ వర్మ ఉచిత చచ్చు సలహా

వివాదాలకు కేరాఫ్ గా నిలిచే రామ్ గోపాల్ వర్మ…తాజాగా నారా లోకేష్ పాదయాత్ర ఫై సంచలన వ్యాఖ్యలు చేసారు. గత 14 రోజులుగా నారా లోకేష్ యువగళం పేరిట పాదయాత్ర చేస్తున్న సంగతి తెలిసిందే. లోకేష్ పాదయాత్ర ప్రజల నుండి విశేష స్పందన వస్తుంది. అడుగడుగునా ప్రజలను పలకరిస్తూ వారి కష్టాలను అడిగితెలుసుకుంటూ , ప్రభుత్వం ఫై విమర్శలు చేస్తూ లోకేష్ యాత్రను కొనసాగిస్తున్నారు.

ఇదిలా ఉంటె నారా లోకేష్ యాత్ర ఫై రామ్ గోపాల్ వర్మ వివాదాస్పద వ్యాఖ్యలు చేసారు. నారా లోకేష్ పాదయాత్ర ఆపేస్తే, చాలా మంచిదన్నారు వర్మ. గుండె పోటు వచ్చిందని చెప్పి.. పాదయాత్ర ను లోకేష్‌ ఆపేస్తాడంటూ సెటైర్లు వేశారు. పాదయాత్రలో జనాలు లేకపోవడం మూలాన నారా లోకేష్‌.. ఒక టెర్రిఫిక్ ఐడియా చేయచ్ఛు! చెస్ట్ నొప్పో ,లిగమెంట్ తెగిందనో చెప్పి, డాక్టర్ ఎట్టి పరిస్థితుల్లోనూ నడక కంటిన్యూ చేయొద్దు అని సర్టిఫికెట్ తీసుకొని, పాద యాత్ర ఆపేస్తే టీడీపీ పార్టీ కి మరియు చంద్రబాబు ఆరోగ్యయానికి చాలా మంచిది. ఇది నా ఉచిత చచ్చు సలహా! అంటూ కామెంట్‌ చేశారు. ఈ వ్యాఖ్యలపై టీడీపీ శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గత కొద్దీ రోజులుగా వర్మ జనసేన, టీడీపీ ఫై సోషల్ మీడియా లో పలు కామెంట్స్ చేస్తూ వస్తున్న సంగతి తెలిసిందే.

మరోపక్క నారా లోకేష్ ‘‘యువగళం’’ పాదయాత్ర 15వ రోజుకు చేరుకుంది. శుక్రవారం ఉదయం గంగాధర నెల్లూరు నియోజవర్గంలో రేణుకాపురం విడిది కేంద్రం నుంచి లోకేష్ పాదయాత్ర ను మొదలుపెట్టారు. ముందుగా సెల్ఫీ విత్ లోకేష్ కార్యక్రమంలో భాగంగా అభిమానులు, ప్రజలతో యువనేత సెల్ఫీలు దిగారు.