cyclone 1

తుఫాన్ ఎఫెక్ట్.. ఈ జిల్లాలకు ఆకస్మిక వరదలు

తెలుగు రాష్ట్రాల ప్రజలను ఫెంగాల్ తుఫాను వణికిస్తోంది. ముఖ్యంగా తుపాను కారణంగా ఏపీలోని పలు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని, తెలంగాణలోని పలు జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. నెల్లూరు, తిరుపతి, చిత్తూరు, అన్నమయ్య, వైఎస్సార్ జిల్లాల్లో ఆకస్మిక వరదలు వచ్చే అవకాశముందని హెచ్చరించింది. లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించింది. తుపాను కారణంగా సముద్రం అలజడిగా మారిన నేపథ్యంలో మత్స్యకారులు సోమవారం వరకు వేటకు వెళ్లరాదని విశాఖ తుపాను హెచ్చరికల కేంద్రం పేర్కొంది.

నాగపట్నానికి 230 కిలో మీటర్లు, పుదుచ్చేరికి 210 కిలో మీటర్లు, చెన్నైకి 210 కిలో మీటర్ల దూరంలో తుపాను కేంద్రీకృతమైంది. గంటకు 7కిలోమీటర్ల వేగంతో ఫెంగాల్ తుపాను కదులుతుంది. ఇది పశ్చిమ – వాయువ్య దిశగా కదులుతూ శనివారం మధ్యాహ్నంకు పుదుచ్చేరిలోని కార్తెకాల్, తమిళనాడు రాష్ట్రంలోని మహాబలిపురం మధ్య తీరం దాటే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. తుపాను ప్రభావంతో తీరం వెంబడి గరిష్టంగా గంటకు 90 కిలో మీటర్ల వేగంతో గాలులు వీస్తాయని, ఆకస్మిక వరదలు వచ్చే ప్రమాదమున్న నేపథ్యంలో ప్రజలు అప్రమతతంగా ఉండాలని విపత్తుల నిర్వహణ సంస్థ సూచించింది. ఆకస్మిక వరదల పట్ల లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఏపీ విపత్తుల నిర్వహణ సంస్థ హెచ్చరించింది. రైతులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించింది. తిరుపతి,నెల్లూరు,ప్రకాశం తీరం వెంబడి 70-90కిమీ వేగంతో బలమైన ఈదురుగాలులు వీస్తాయని హెచ్చరించింది.

తెలంగాణలో ఇవాళ్టి నుంచి (నవంబర్ 30) ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ములుగు, కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ జిల్లాల్లో అక్కడక్కడ వానలు కురుస్తాయని పేర్కొంది. ఈ జిల్లాలకు ఎల్లో హెచ్చరికలు జారీ అయ్యాయి. డిసెంబర్ 1వ తేదీన కరీంనగర్, పెద్దపల్లి, భూపాలపల్లి, ములుగు, కొత్తగూడెం, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, పెద్దపల్లి, వరంగల్, హన్మకొండ, జనగామ, సిద్ధిపేట, యాదాద్రి, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్, మల్కాజ్ గిరి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి, నారాయణపేట, గద్వాల జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఈ జిల్లాలకు ఎల్లో హెచ్చరికలు జారీ అయ్యాయి. డిసెంబర్ 2వ తేదీన కూడా తెలంగాణలోని పలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వానలు పడుతాయని ఐఎండీ హైదరాబాద్ అంచనా వేసింది. ఇక 3వ తేదీ నుంచి తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు పడుతాయని… ఎలాంటి హెచ్చరికలు లేవని వివరించింది.

Related Posts
కాశీలో ఫిబ్రవరి 5 వరకు గంగాహారతి నిలిపివేత..
Gangabharati suspended till February 5 in Kashi

కాశీ: జనం రద్దీని దృష్టిలో ఉంచుకుని ఫిబ్రవరి 5 వరకు సాధారణ ప్రజల కోసం వారణాసిలోని ఘాట్‌లలో నిర్వహించే గంగా హారతిని అధికారులు నిలిపివేశారు. కాశీ ప్రజలు Read more

Pawan Kalyan:ఎన్నికల హామీల అమలుపై ఏపీ సర్కారు ఫోకస్
pawan kalyan 200924

ఆంధ్రప్రదేశ్‌లో కూటమి ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చడంపై ప్రత్యేక దృష్టి పెట్టింది అధికారంలోకి వచ్చాక మొదటగా పెన్షన్‌ పెంపు అమలు చేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు Read more

ఎమ్మెల్సీ ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై మంత్రి ఉత్తమ్ దిశా నిర్దేశం
Minister Uttam Kumar warning to party MLAs and MLCs

ఈ ఎన్నికల్లో విజయాన్ని సాధించేందుకు కాంగ్రెస్ శ్రేణులు క్షేత్రస్థాయిలో అప్రమత్తంగా ఉండాలి తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం స్థానిక సంస్థల ఎన్నికల్లో విజయాన్ని సాధించాలని లక్ష్యంగా పెట్టుకుంది. ఈ Read more

దావోస్ పెట్టుబడులపై హరీష్ రావు ఫైర్
దావోస్ పెట్టుబడులపై హరీష్ రావు ఫైర్

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దావోస్ పెట్టుబడుల గురించి ప్రస్తావిస్తూ, ఆ దావాలకు చట్టబద్ధత లేదని మాజీ మంత్రి టి. హరీష్ రావు మండిపడ్డారు. రైతుల సమస్యలపై ప్రభుత్వం Read more

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *