danurmasam

డిసెంబరు 16 నుండి ధనుర్మాసం ఆరంభం

✍️డిసెంబరు 16 నుండి జనవరి 14వ తేదీ వరకు ధనుర్మాసం

👉డిసెంబరు 17వ నుండి సుప్రభాతం స్థానంలో తిరుప్పావై

తిరుమల:
తిరుమల శ్రీ వెంకటేశ్వరస్వామి మాసోత్సవాల్లో అత్యంత ముఖ్యమైనదిగా భావించే ధనుర్మాసం డిసెంబ‌రు 16వ తేదీన ప్రారంభం కానుంది. ఆరోజు ఉద‌యం 6.57 గంటలకు ధనుర్మాస ఘడియలు ప్రారంభం కానున్న నేపథ్యంలో డిసెంబరు 17వ తేదీ నుండి స్వామివారికి నిర్వహించే సుప్రభాత సేవ స్థానంలో తిరుప్పావై నివేదిస్తారు. కాగా జనవరి 14న ధనుర్మాస ఘడియలు ముగియనున్నాయి.

ధ‌నుర్మాసం సంద‌ర్భంగా శ్రీ‌వారికి విశేష కైంక‌ర్యాలు నిర్వ‌హిస్తారు. బిల్వ ప‌త్రాల‌తో స‌హ‌స్ర నామార్చ‌న చేస్తారు. శ్రీ‌విల్లి పుత్తూరు చిలుకలను ప్ర‌తి రోజూ స్వామివారికి అలంక‌రిస్తారు. ధ‌నుర్మాసం సంద‌ర్భంగా శ్రీ‌వారికి విశేష నైవేద్యాలుగా దోశ‌, బెల్లం దోశ‌, సుండ‌లు, సీరా, పొంగ‌ల్ వంటి ప్ర‌సాదాల‌ను నివేదిస్తారు.

👉ధనుర్మాసానికి విశేష ప్రాధాన్యం…

పురాణాల ప్రకారం ధనుర్మాసంలో దేవతలు సూర్యోదయానికి ఒకటిన్నర గంట ముందుగా నిద్రలేచి బ్రహ్మ ముహూర్తంలో శ్రీమహావిష్ణువును ప్రత్యేకంగా ప్రార్థిస్తారు. కావున ఈ మాసానికి సౌరమానంలో ప్రత్యేక ప్రాధాన్యం ఉంది.

👉ఆండాళ్‌ తిరుప్పావై పారాయణం…

12 మంది ఆళ్వార్లలో శ్రీ ఆండాళ్‌(గోదాదేవి) ఒకరు. ఈమెను నాచియార్‌ అని కూడా పిలుస్తారు. శ్రీవేంకటేశ్వరస్వామివారిని స్తుతిస్తూ ఆండాళ్‌ రచించిన 30 పాశురాలను కలిపి తిరుప్పావై అంటారు. ఆళ్వార్‌ దివ్యప్రబంధంలో తిరుప్పావై ఒక భాగం. తమిళ సాహిత్యంలో దీనికి విశేష ప్రాచుర్యం ఉంది. శ్రీవారి ఆలయంలో నెల రోజులపాటు జరిగే తిరుప్పావై పారాయణంలో రోజుకు ఒకటి వంతున అర్చకులు నివేదిస్తారు. ఈ సందర్భంలో సాధారణంగా భోగశ్రీనివాసమూర్తికి బదులుగా శ్రీకృష్ణస్వామివారికి ఏకాంతసేవ నిర్వహిస్తారు. ఈ తిరుప్పావై పఠనం పూర్తిగా ఏకాంతంగా జరుగుతుంది.

Related Posts
 టీడీపీ ఆఫీసుపై దాడి, చంద్రబాబు నివాసంపై దాడి కేసులు సీఐడీకి అప్పగింత
tdp office attack case 114183947

టీడీపీ ప్రధాన కార్యాలయంపై దాడి కేసులు సీఐడీకి బదిలీ ఆంధ్రప్రదేశ్‌లో టీడీపీ ప్రధాన కార్యాలయం మరియు టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు నివాసంపై జరిగిన దాడుల Read more

రేషన్ బియ్యం వ్యాపారులను వదిలిపెట్టం: సీఎం చంద్రబాబు
Future There Will Be Only One Thing That Is Tourism. CM Chandrababu

రేషన్ బియ్యాన్ని కొని విదేశాలకు అమ్ముతున్నారని సీఎం చంద్రబాబూ అన్నారు. ఆలా చేసే వారిని వదిలిపెట్టబోమని, కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. గత ఐదేళ్లలో ఎక్కడ Read more

విజ‌య‌సాయిరెడ్డికి ఈడీ మ‌ళ్లీ నోటీసులు
vijayasai reddy

ఏపీలో కూటమి అధికారంలోకి వచ్చాక మంత్రి లోకేష్ తన రెడ్ బుక్ లో రాసుకున్న వైసీపీ నాయకుల అవినీతి చిట్టాను వెలికితీస్తున్నారు. ఇందులో భాగంగా కాకినాడ పోర్టు Read more

ఏపీలో ఆశా వర్కర్లకు నారా లోకేష్ భరోసా!
ఏపీలో ఆశా వర్కర్లకు నారా లోకేష్ భరోసా!

ఆంధ్రప్రదేశ్‌ మంత్రి నారా లోకేష్‌ను విశాఖపట్నంలో ఆశా వర్కర్లు కలిశారు. తమకు ఉద్యోగ భద్రత కల్పించాలని.. తమ సమస్యలను పరిష్కరించాలని వినతి పత్ర సమర్పించి కోరారు. తమను Read more

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *