ఈ సిరీస్ అక్టోబర్ 25న జీ5లో ప్రసారం కానుంది. ఇటీవల విడుదలైన టీజర్ మరియు ట్రైలర్ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చకు దారితీశాయి ముఖ్యంగా ఈ ట్రైలర్‌ను ప్రముఖ నటుడు విజయ్ సేతుపతి విడుదల చేయడం విశేషం వెయ్యేళ్లకు ఒకసారి గురు శుక్ర శని కుజగ్రహాలు ఒకే వరుసలో ఉండటం వలన అద్భుతం జరుగుతుందని చరిత్ర చెబుతుంది అంటూ సాగే ట్రైలర్ ఆసక్తికర కథాంశాన్ని తెలియజేస్తుంది చారిత్రక మిస్టరీ ఫాంటసీ మరియు థ్రిల్లర్ అంశాలు కలగలిపిన ఈ కథలో ఎన్నో రహస్యాలు ఉండబోతున్నాయనిపిస్తోంది నాలుగు వేదాలతో ప్రపంచం పొందినప్పటికీ ఈ సిరీస్‌లో ఐదో వేదం అనే కొత్త కాన్సెప్ట్‌ను ప్రేక్షకులకు అందించనున్నారు ఈ సిరీస్ సాంకేతికంగా ఎంతో బలంగా నిలుస్తోంది శ్రీనివాసన్ దేవరాజన్ ఛాయాగ్రహణం అద్భుతంగా ఉంది మిస్టరీ థ్రిల్లర్ మూమెంట్స్‌కి ఆయన కెమెరా వర్క్ ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది ట్రైలర్‌లో చూపిన విజువల్స్ యాక్షన్ సీక్వెన్సులు విజువల్ ఎఫెక్ట్స్ ప్రేక్షకులను ఉత్కంఠపరిచేలా ఉన్నాయి రేవా అందించిన నేపథ్య సంగీతం సిరీస్ థ్రిల్లింగ్ ఎలిమెంట్స్‌కి పూర్తి న్యాయం చేసింది
దర్శకుడు ఎల్ నాగరాజన్ ఈ సిరీస్‌లో మర్డర్ మిస్టరీ సోషియో-ఫాంటసీ అంశాలను చక్కగా మేళవించారు ఎడిటర్ రెజీష్. ఎం.ఆర్ స్మూత్ కథనంతో సీక్వెన్సుల మధ్య సమతూకం కల్పించారు అలాగే పి. సోమసుందరం ప్రొడక్షన్ మేనేజ్‌మెంట్‌ను చక్కగా నిర్వహించారు బి. మనోజ్ కృష్ణ కాస్టింగ్ డైరెక్షన్ అందిస్తూ ప్రతీ పాత్రకు సరైన నటీనటులను ఎంపిక చేశారు ఐందామ్ వేదం సిరీస్ ప్రేక్షకులను కొత్త అనుభూతికి గురి చేయడం ఖాయం సస్పెన్స్ థ్రిల్ ఫాంటసీ కలగలిపిన ఈ కథ వేదాలు గ్రహాల అనుబంధంతో మరో వైవిధ్యమైన కథను అందించనుంది అక్టోబర్ 25 న జీ5లో ఈ వెబ్ సిరీస్ విడుదల కానుండటంతో ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.