vasireddy padma

గోరంట్ల‌ మాధ‌వ్‌పై పోలీసులకు పిర్యాదు చేసిన వాసిరెడ్డి ప‌ద్మ

వైసీపీని వీడిన ఏపీ మహిళా కమిషన్ మాజీ ఛైర్‌పర్సన్ వాసిరెడ్డి పద్మ.. తాజాగా మాజీ ఎంపీ గోరంట్ల మాధవ్‌పై పోలీసులకు ఫిర్యాదు చేసారు. గోరంట్ల మాధవ్ అత్యాచార బాధితుల పేర్లను బహిర్గతం చేయడం అనైతికమని, బాధితుల గోప్యతను ఉల్లంఘించడం దుర్మార్గమని తెలుపుతూ ఆమె పిర్యాదు చేసింది. విజయవాడ సీపీ రాజశేఖర్‌బాబుకు ఇచ్చిన ఫిర్యాదులో ఆమె, బాధితుల గౌరవాన్ని కాపాడేందుకు మాధవ్‌పై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కోరారు.

మహిళల మీద, అత్యాచార బాధితుల పట్ల సోయిలేకుండా ఒక మాజీ ఎంపీ ఈ విధంగా మాట్లాడటం సభ్య సమాజం తలదించుకునేలా ఉందన్నారు. ఈ ఘటనకు గురైన బాధితుల పట్ల ఇంత దుర్మార్గంగా మాట్లాడిన గోరంట్ల మాధవ్ మీద చర్యలు తీసుకోవాలని వాసిరెడ్డి పద్మ కోరారు.

వాసిరెడ్డి పద్మ విషయానికి వస్తే..ఏపీ రాజకీయ నాయకురాలు, సమాజసేవకురాలు. ఏపీ మహిళా కమిషన్ ఛైర్‌పర్సన్‌గా ఈమె కీలక భాద్యతలు నిర్వర్తించారు. ఈ పదవిలో ఉన్నప్పుడు, మహిళల హక్కులను రక్షించడానికి, మహిళలపై జరిగే అన్యాయాలను ఎదుర్కొనేందుకు అనేక చర్యలు చేపట్టారు. వాసిరెడ్డి పద్మ రాజకీయ ప్రయాణాన్ని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ (వైసీపీ)తో ప్రారంభించి, ఆ పార్టీతో పాటు ప్రజల సేవలో పనిచేశారు. ఇటీవల ఆమె వైసీపీని వీడి బయటకు రావడం వార్తల్లో నిలిచింది. వైసీపీని వీడిన తర్వాత ఆమె జగన్ పై ఆ పార్టీ విధానాలపై విమర్శలు చేసారు.

Related Posts
చట్టం తన పని తాను చేసుకుపోతుంది: మంత్రి కోమటిరెడ్డి
Law will do its job: Minister Komatireddy

హైదరాబాద్‌: సినిమాటోగ్రఫి శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌ రెడ్డి సినీ నటుడు అల్లు అర్జున్ ఇంటిపై జరిగిన దాడిని తీవ్రంగా ఖండించారు. ప్రజాస్వామ్యంలో భౌతికదాడులకు తావులేదని చెప్పారు. Read more

కొనసాగుతున్న హర్యానా అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌
Voters

ఛండీగఢ్: హర్యానాలో అసెంబ్లీ ఎన్నికల పోలింగ్‌ కొనసాగుతున్నది. ఉదయం 7 గంటలకు ప్రారంభమైన ఓటింగ్‌ సాయంత్రం 6 గంటల వరకు కొనసాగనుంది. ఉదయం నుంచే ఓటర్లు పోలింగ్ Read more

విజయవాడలో 25వ ఏప్రిలియా RS457ను డెలివరీ చేసిన ఇన్నోవియా మోటర్స్
Innovia Motors delivered Aprilia RS457 on 25th in Vijayawada

విజయవాడ: పియాజియో ఇండియా యొక్క ప్రతిష్టాత్మక ద్వి చక్ర వాహన బ్రాండ్‌లు వెస్పా మరియు ఏప్రిలియా కోసం అధీకృత రిటైలర్ అయిన ఇన్నోవియా మోటర్స్, ఈరోజు విజయవాడలోని Read more

మన్మోహన్ సింగ్ అస్తికల నిమజ్జనానికి హాజరుకాని కాంగ్రెస్?
మన్మోహన్ సింగ్ అస్తికల నిమజ్జనానికి హాజరుకాని కాంగ్రెస్?

కాంగ్రెస్ పార్టీ మన్మోహన్ సింగ్ అస్తికల నిమజ్జనానికి ఎందుకు హాజరుకాలేదో వివరణ ఇచ్చింది. అంత్యక్రియల అనంతరం, కాంగ్రెస్ సీనియర్ నేతలు సోనియా గాంధీ మరియు ప్రియాంక గాంధీ Read more

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *